హాలీవుడ్ నటుల్ని మెప్పించిన మురుగుదాస్! తమిళంలో అవకాశం ఇవ్వాలని కామెంట్

హాలీవుడ్ సినిమాలు అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉంటారు.అయితే ఇండియన్ సినిమాలకు వచ్చేసరికి కేవలం సౌత్ ఏషియా దేశాలకు మాత్రమే పరిమితం.

 Hollywood Actor Tweet On Darbar Movie-TeluguStop.com

అయితే ప్రపంచ మార్కెట్లో ఇండియాలోనే ప్రతియేటా అత్యధికంగా సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో అవార్డులు గెలుచుకున్న అక్కడి నటుల్ని మాత్రం ఆకర్షిస్తుంది.

ఇక సౌత్ ఇండియాలో టాలెంటెడ్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు మురుగదాస్.తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్ చేసిన ట్వీట్ ఇప్పుడు అతన్ని షాక్ కి గురి చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించాలని ఉందంటూ డ్యూక్ ట్విట్టర్ వేదికగా రజినీకాంత్ మనం మురుగుదాస్ ను టాప్ చేస్తూ ట్వీట్ చేశారు.మురుగదాస్ నాకు తమిళం రాదు కానీ మీరు తీస్తున్న దర్బార్ సినిమాలో నటించాలని ఉంది.

నేను రజినీకాంత్ సోదరుడి పాత్రలో కానీ, నయనతార అంకుల్ పాత్రలో కానీ నటిస్తాను.అనిరుద్ రవిచంద్రన్ మా లాంటి స్టార్ నటుల కోసం మంచి పాటను కంపోజ్ చేస్తే బాగుంటుంది అని ట్వీట్ చేశారు.

ఇది చూసిన మురుగదాస్ సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి సార్ ఇది నిజంగా మీరేనా అని ప్రశ్నించారు.దీనికి బిల్ డ్యూక్ సమాధానంగా హాలీవుడ్ లో ఏజెంట్లు, మేనేజర్లు మా పనికి సంబంధించిన విషయాలు చూసుకుంటారు కానీ మన లాంటి నటులు, దర్శకులు, రచయితలు, ఆర్టిస్టులు అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం మంచి సినిమాను అందించాలని కలలు కంటూ ఉంటాం అని ట్వీట్ చేశారు.

మరి బిల్ డ్యూక్ అభ్యర్థిని మురుగదాస్ ఎంతవరకు అంగీకరించి దర్బార్ సినిమాలో అవకాశం ఇస్తాడు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube