విడ్డూరం : పాపం కొత్త అల్లుడికి ఇదేం మర్యాద, పండుగ రోజు అల్లుడిని ఇలా చేయడం అక్కడ ఆచారమట!

ఇతర దేశాల సంగతి ఏమో కాని మన దేశంలో మాత్రం ఇంటి అల్లుడు అంటే చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి.ముఖ్యంగా కొత్త అల్లుడు అంటే ఆ మర్యాదలే వేరు.

 Holi Tradition Of Donkey Ride For Newly Married Son In Law In Maharashtra Villa-TeluguStop.com

జీవితంలో ఒక్కసారైనా కొత్త అల్లుడిగా అత్తారింటికి వెళ్లాలి, వారు ఇచ్చే గౌరవ మర్యాదలను స్వీకరించాలని తెలుగు వారిలో ఒక సామెత కూడా ఉంది.ఇండియా మొత్తం కూడా కొత్త అల్లుడికి ఇచ్చే మర్యాద ఓ రేంజ్‌లో ఉంటుంది.

ఈ మర్యాద కొన్ని చోట్ల శృతి మించుతోంది.కొందరి పరువు తీసేలా ఉంది.

Telugu Holidonkey, Maharastra Holi, Maharastra, Son Law Donkey-General-Telugu

తాజాగా హోళీ పండుగ సందర్బంగా మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో కొత్త అల్లుల్లకు వింత ట్రీట్‌మెంట్‌ ఉంటుంది.అంతే వారిని ప్రత్యేకంగా గౌరవించేందుకు ఏకంగా గాడిదపై ఊరంతా ఊరేగిస్తారు.గ్రామంలో ఆ అల్లుడికి వరుస అయ్యే వారు గాడిదపై ఊరేగుతున్న అల్లుడిపై రంగులు పూస్తారు.ఆ సమయంలో అల్లుడిని ఆడుకునే బావమర్దులు కూడా ఉంటారు.మరదల్లు బావమర్దులు బావ గాడిదపై ఊరేగుతుంటే అతడిని అల్లరి చేయడం అతడిపై రంగులు నీళ్లు గుమ్మరించడం చేస్తూ ఉంటారు.

ఇది పూర్వ కాలం నుండి వస్తున్న ఆనవాయితీగా చెబుతున్నారు.

కొందరు గాడిదపై ఊరేగేందుకు ఆసక్తి చూపని కారణంగా ఈ పద్దతి కనుమరుగవుతోంది.కొందరు మాత్రం ఇంకా గాడిదపై ఊరేగుతూనే ఉన్నారు.

నిన్న హోళీ సందర్బంగా ఆ గ్రామాల్లో పలు చోట్ల ఇలా గాడిదలపై కొత్త అల్లుడికి రంగులు కురిపించారు.ఈ పద్దతి సరదాగా ఉంటుంది కనుక మేము కంటిన్యూ చేస్తున్నామని వారు చెప్పారు.

అయితే గాడిదపై ఎక్కి కూర్చుని పండుగ చేసుకోవడం ఏంటీ విడ్డూరం కాకపోతే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.మొత్తానికి పాపం అక్కడి అల్లుల్లు చుక్కలు చూస్తున్నారేమో కదా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube