నేడే భారత్ - జపాన్ మధ్య హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్..!

చెన్నై వేదికగా బుధవారం భారత్- పాకిస్తాన్ మధ్య కీలకమైన హాకీ మ్యాచ్( Hockey ) జరిగింది.దాయాది జట్టును చిత్తుగా ఓడించి భారత్ ఘనవిజయం( India ) సాధించి సెమీఫైనల్ చేరింది.

 Hockey Champions Trophy Semifinal Match Between India Vs Japan Details, Hockey C-TeluguStop.com

ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో పాక్ పై 4-0 తేడాతో భారత్ గెలిచింది.భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్, జుగ్రాజ్ సింగ్ ఒక గోల్, ఆకాష్ దీప్ సింగ్ ఒక గోల్ చేశారు.

అయితే ఈ నాలుగు గోల్స్ లలో, మూడు గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారా వచ్చాయి.ఒక గోల్ ఆకాష్ దీప్ సింగ్( Akash Deep Singh ) ఫీల్డ్ గోల్ చేశాడు.

దీంతో భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండా అధ్యయంగా మ్యాచ్ ముగించింది.

భారత జట్టు ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లు గెలిచి, ఒక మ్యాచ్ డ్రాగా ముగించుకుని, 13 పాయింట్లు సాధించింది.శుక్రవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో జపాన్ ను ( Japan ) భారత్ ఢీకొట్టనుంది.మరో సెమీ ఫైనల్ మ్యాచ్ కొరియా- మలేషియా మధ్య జరగనుంది.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరు జట్లు తలపడ్డాయి.భారత జట్టు నాలుగు మ్యాచ్లలో మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకొని పది పాయింట్లు టేబుల్ టాపర్ గా నిలిచింది.

తాజాగా బుధవారం జరిగిన మ్యాచ్లో గెలిచి ఒక్క ఓటమి కూడా లేకుండా లీగ్ ముగించింది.ఇక ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు( Pakistan ) పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.పాకిస్తాన్ జట్టు లీగ్ లో కేవలం ఒక్క మ్యాచ్ గెలిచి, రెండు మ్యాచ్లను డ్రా చేసుకొని, మిగతా మ్యాచ్లలో ఓటమిపాలై సెమీస్ నుంచి నిష్క్రమించింది.సెమీస్ చేరెందుకు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కనీసం ఒక్క గోల్ కూడా చేయకుండానే లీగ్ నుంచి తప్పుకొని ఇంటిదారి పట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube