వామ్మో.. ఈ కోడిగుడ్ల ధ‌ర రూ.500.. ఎక్క‌డంటే..?

స‌హ‌జంగా ఒక కోడి గుడ్డుకు మార్కెట్‌లో రూ.6 మించి ఉండదు.కొన్ని సంద‌ర్భాల‌లో కోడిగుడ్లు దొర‌క‌పోతే మ‌రో రెండు రూపాయ‌లు పెట్టి కొనుగోలు చేస్తారు.కానీ ఒక కోడి గుడ్డుకు ఏకంగా రూ.500 పెట్టి కొనేస్తున్నార‌టా? ఇది చెబితే చాలా మంది విచిత్రంగా చూసేవాళ్లు ఉంటారు.కానీ ఇది నిజ‌మేనంటా? తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మం జిల్లా త‌ల్లాడ‌లో యువ‌కులు అమ్మే కోడిగుడ్డుకు రూ.500 పెట్టి కొనుగోలు చేస్తున్నారు.అయితే ఆ కోడి గుడ్డును అంత ధ‌ర పెట్టి ఎందుకు కొంటున్నారో తెలుసుకుందాం.

 Ho My God.. The Price Of These Eggs Is Rs.500 .. Where Is It Eggs, High Price-TeluguStop.com

న‌రేంద్ర, సీతారామిరెడ్డి , వేణుగోపాల్ రెడ్డి ముగ్గురు డిగ్రీ పూర్త‌యిన‌వారు.అందులో ఒక‌రు ఎంబీఏ చేయ‌గా, మిలిగిన ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ పూర్తి చేశారు.ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించ‌కుండా, త‌మ గ్రామం రామానువ‌రంలో కొత్త‌గా వ్యాపారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.సీతారామిరెడ్డికి చెందిన మామిడి తోట‌లో కోళ్ల పెంచాల‌ని డిసైడ్ అయ్యారు.

Telugu Rupees, Chicken, Eggs, Naredra Reddy-Latest News - Telugu

రెండు ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టి నాటుకోళ్లు కొన్నారు.వాటి క్రాసింగ్‌లో ఒకే జాతికి చెందిన కోడి పుంజు కోనుగోలు చేశారు.జాగ్ర‌త్త‌గా క్రాసింగ్ చేయ‌డంతో మంచి గుడ్లు పెట్టాయి కోళ్లు.వాటి ద్వారా మ‌ళ్లి కోడి పిల్ల‌ల‌ను త‌యారు చేస్తున్నారు.ఆ కోళ్లు పెడుతున్న గుడ్ల‌ను ఒక్కొక్క‌టి రూ.500ల‌కు అమ్మేస్తున్నారు.ఇలా ఒకే జాతి కోడి పుంజు ద్వారా కోడి పిల్ల‌లు ఉండ‌డంతో వాటిని వారం రోజులలో రూ.1000ల‌కు అమ్ముతున్నారు.

ఇలా వ‌చ్చే ఆదాయంతో మ‌రిన్ని కోళ్ల‌నుకొనుగోలు చేయాల‌ని చూస్తున‌నారు.త‌మ ద‌గ్గ‌ర ఉన్న50 కోడి పెట్టెలు, 5 పుంజులు, 50 పిల్ల‌లు ఉన్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు 1200 కోడి పిల్ల‌ల‌ను అమ్మేశారు.వారి ఫాంలో ఉన్న కోడి పుంజు ధ‌ర సుమారు 70వేల నుంచి రూ.1.50 ఉంటుంద‌ని చెబుతున్నారు.ఏపీలో కొనుగోలు చేసిన ఈ పుంజుల ద్వారా తెలంగాణ‌లో ఉన్న కోడి పెట్టెల‌తో క్రాసింగ్ చేయ‌డం ద్వారా మేలు రకం కోడి గుడ్లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube