వామ్మో భారీ కొండ‌చిలువ‌తో ఇత‌ను ఎలా ఆడుతున్నాడో చూడండి..

పాముల్లో చాలా పెద్ద జీవి ఏదంటే మ‌న‌కు ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది కొండ చిలువ మాత్ర‌మే.అది చూసేందుకు అత్యంత భ‌యంకరంగా, చాలా ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంది.

 Ho My God See How Is Playing With A Huge Python Details, Huge Python, Viral Vide-TeluguStop.com

మ‌న‌కు సాధార‌ణంగా పాము పేరు వింటేనే చాలా భ‌యం వేస్తుంది.వాటి ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు కూడా మ‌నం వ‌ణికిపోతుంటాం.

అవి ఎక్క‌డ క‌రుస్తాయో అనే టెన్ష‌న్ మ‌న‌కు ఉంటుంది.అయితే కొంద‌రు మాత్రం పాముల‌ను ఏ మాత్రం భ‌యం లేకుండా ప‌ట్టుకుని ఇంకా దానితో ఆట‌లు కూడా ఆడుతుంటాడు.

అదేం విచిత్ర‌మో అర్థం కాదు గానీ ఇలాంటి వారిని ఆ పాములు కూడా ఏమీ అన‌వు.

అవి వారికి భ‌య‌ప‌డుతాయో లేదంటే ఇంకేమైనా జ‌రుగుతుందో మ‌న‌కు అర్థం కాదు గానీ అవి మాత్రం వారిని ఏమీ అన‌కుండా ఉండ‌ట‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

ఇక కొండ చిలువ విష‌యానికి వ‌స్తే మాత్రం అది త‌న దగ్గరకు  ఎవ‌రు వ‌చ్చినా స‌రే మింగేసి న‌మిలేయ‌డ‌మే దానికి తెలిసిన ప‌ని.అయితే ఇప్పుడు మాత్రం ఓ కొండ చిలువ‌తో ఓ వ్య‌క్తి ఎంచ‌క్కా ఆట‌లాడుతున్నా కూడా అత‌న్ని ఏమీ అన‌ట్లేదు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.ఇందులో ఓ కొండ చిలువ చిన్న టబ్‌లో సేద తీరుతోంది.

ఇంత‌లోనే ఓ వ్యక్తి ఆ కొండ చిలువ పెట్టిన గుడ్లను తీసేందుకు వ‌స్తుంటాడు.దాన్ని గ‌మ‌నించిన ఆ కొండ చిలువ అతడిపై దాడికి దిగుతుండ‌టం మ‌న‌కు ఈ వీడియోలో క‌నిపిస్తుంది.ఇక అత‌ను మాత్రం భ‌య‌ప‌డ‌కుండా దాన్నిప‌క్క‌కు జ‌రిపి ఎలాగైనా గుడ్ల‌ను తీసేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాడు.నిజానికి అత‌ను దాని కేర్ టేక‌ర్‌. దానికి, అత‌నికి అత్యంత స‌న్నిహిత్యం ఉందంట‌.కానీ గుడ్ల‌ను తాకేందుకు రావ‌డంతో ఇలా కోపానికి వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో మీద నెటిజ‌న్లు చాలా ర‌కాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube