వామ్మో.. 555 ప‌ళ్లు ఉన్న రాకాసి చేప‌ను మీరు చూశారా..

మ‌న‌కు తెలియ‌దు గానీ చేప‌ల్లో చాలా ర‌కాలు ఉన్నాయండోయ్.నిత్యం ఏదో ఒక కొత్త ర‌కం చేప గురించి మ‌నం వింటూనే ఉంటాం.

 Ho My God Have You Seen The 555 Teeths Danger Fish Details, Danger Fish, Viral N-TeluguStop.com

జాల‌ర్ల‌కు వ‌ల‌లో ప‌డ్డ వింత చేప‌ల వార్త‌ల‌కు కొదువే లేదు.వింతగా ఉండే చేప‌ల ద‌గ్గ‌రి నుంచి ప్ర‌మాద‌క‌ర చేప‌ల దాకా మ‌న‌కు తెలుసు.

అయితే ఇప్పుడు కూడా ఓ వింత చేప గురించి మ‌నం తెలుసుకుందాం.ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చిక్కిన చేప గురించి వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

ఎందుకంటే ఇది చూసేందుకు చిన్న‌గా అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉందండోయ్‌.దీని పేరు సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్ అని చెబుతున్నారు.

భారీ ఆకారంతో పాటు డిఫ‌రెంట్ సైజుల‌తో ఉండే ఈ చేప‌ను దెయ్యం చేప అని కూడా పిలుస్తార‌ని చెబుతున్నారు స్థానిక జాల‌ర్లు.అయితే పసిఫిక్​ మహా సముద్రంలో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లిన జాల‌ర్ల‌కు వారి వ‌ల‌లో ఈ చేప చిక్కింది.

ఏదో మామూలు చేప అనుకున్నారంట మొద‌ట‌.కానీ దాన్ని ప‌రీక్షించి చూస్తే దాని నోట్లో 555 పళ్లు ఉండ‌టంతో షాక్ అయిపోయారంట‌.

పసిఫిక్ లింగ్‌కాడ్ అనే అరుదైన చేప జాతికి చెందిందని జాల‌ర్లు వివ‌రించారు.ఇది క‌రిస్తే మాత్రం వేళ్లు కూడా క‌ట్ అయిపోయాతాయంటూ వివ‌రించారు.

Telugu Fish, Andhra Pradesh, Danger Fish, Demon Fish, Fisher, Suckermouth-Latest

ఇవి మ‌న ప్రాంతంలో అరుదుగా క‌నిపిస్తాయ‌ని ఎక్కువ‌గా ఉత్తర పసిఫిక్‌ తీరంలోనే నివ‌సిస్తాయంటూ జాల‌ర్లు వివ‌రించారు.వీటిలో ప్ర‌త్యేకత ఏంటంటే వీరి శ‌రీర బ‌రువు క‌న్నా కూడా దంతాలే వేగంగా పెరుగుతాయని దాంతో పాటే వేగంగా ఊడిపోతాయని వివ‌రించారు.ఈ చేప ప‌ళ్లు రంపాల్లాగే షార్ప్ గా ఉంటాయ‌ని గ‌తంలో సైంటిస్టులు వివ‌రించారు.ఇంకో విష‌యం ఏంటంటే ఈ చేప ప‌ళ్ల మీద యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో కొన్ని ప్ర‌యోగాలు కూడా చేశారు.

కాగా ఈ చేప‌ల‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube