వామ్మో.. 11 పాముల‌ను ఒకేసారి నోట్లో పెట్టుకున్న వ్య‌క్తి..

అందరిలో ఒకడిగా ఉండకుండా తమ కంటూ ప్రత్యేకత ఉండాలని కొందరు వినూత్నమైన పనులు చేస్తుండటం మనం చూడొచ్చు.ఈ కోవకు చెందిన వారు చాలా మంది ఉంటారు.

 Ho Mu God. The Person Who Put 11 Snakes In A Note At Once .., Snakes, Viral Pic,-TeluguStop.com

అలా తమకంటూ ప్రత్యేకత ఉండాలనుకుని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డులను సృష్టిస్తుంటారు.

అందుకుగాను కష్టమైన, ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు, వింతలు, భయంకరమైన పనులు చేస్తుంటారు.అలా రికార్డు సృష్టించేందుకుగాను ఓ వ్యక్తి భయంకరమైన పని చేశాడు.

అయినప్పటికీ రికార్డు నెలకొల్పలేకపోయాడు.ఇంతకీ ఏం చేశాడంటే.

టెక్సాస్‌ సిటిలో నివసించే జాకీ బిబ్బీ అనే పర్సన్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసేందుకుగాను విషపూరితమైన పాములను నోట్లో పెట్టుకున్నాడు.అది కూడా ఒకటి లేదా రెండు కాదండోయ్.

కంగా 11 ప్రమాదకరమైన, విషపూరితమైన రాటిల్ పాములు నోట్లో పెట్టుకున్నాడు.ఆ ఫీట్ చూస్తే చాలు.

ఎవరికైనా ఒళ్లు గగుర్పొడచడంతో పాటు భయం వేస్తుంటుంది.అటువంటి ఫీట్ చేసినప్పటికీ అతడి పేరు మీద రికార్డు నమోదు కాలేదు.

ఎందుకంటే అలా ప్రమాదకరమైన పాములను నోట్లో పెట్టుకుంటే గిన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్‌లో నమోదు చేసే కేటగిరీని తొలగించారు.దాంతో అతగాడి ప్రయత్నానికి ఫలితం లేకుండా పోయింది.

Telugu Latest, Ratil-Latest News - Telugu

గతంలో ఇలా చాలా మంది ప్రమాదకరమైన స్నేక్స్‌ను మౌత్‌లో పెట్టుకుని రికార్డుకెక్కారు.ఈ నేపథ్యంలోనే టెక్సాస్‌కు చెందిన జాకీ బిబ్బీ ట్రై చేశాడు.స్వయంగా బిబ్జీ సైతం ఇదే ఫీట్‌ను 2010లొ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.అయితే, ఈ సారి మాత్రం ఆ కేటగిరీ తొలగించడంతో అతడి ప్రయత్నం వృథాగా పోయింది.

కాగా, ఈ విషయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు తెలిపారు.సోషల్ మీడియా వేదికగా వారు ఈ విషయం పేర్కొన్నారు.ఫేస్ బుక్ పేజీలో ‘త్రో బ్యాక్ థర్స్ డే ’ క్యాప్షన్‌తో ఫొటో షేర్ చేయగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఈ స్టంట్ ఫొటో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.11 పాముల్లో ఏ ఒక్క పాము కాటు వేసినా అతడి పరిస్థితి అంతే అని అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube