హెచ్‌ఐవీ భయంతో గ్రామంలోని చెరువు నీరు అంతా 20 మోటర్లు పెట్టి తోడారు.. అసలు విషయం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు  

Hiv Woman Died In Morat Village Drinking Water In Karnataka-morat Village Drinking Water,viral About Morat Village

కంప్యూటర్‌ యుగంలో కూడా కొందరు చేసే పనులు చూస్తుంటే నవ్వు వస్తుంది. సైన్స్‌ను నమ్ముతామంటూనే సైన్స్‌ చెప్పినట్లుగా వినేందుకు ఇష్టపడటం లేదు. తాజాగా ఒక చెరువులో హెచ్‌ఐవీ ఉన్న మహిళ మరణించింది..

హెచ్‌ఐవీ భయంతో గ్రామంలోని చెరువు నీరు అంతా 20 మోటర్లు పెట్టి తోడారు.. అసలు విషయం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు-HIV Woman Died In Morat Village Drinking Water In Karnataka

ఆ మహిళ శరీరంను చేపలు మరియు కప్పలు కొరకడంతో తూట్లు పడ్డాయి. అలా ఆమె రక్తం చెరువు నీటిలో కలిసి పోయిందని, అందువల్ల చెరువు నీరు కుషితం అయ్యిందని చెప్పి చెరువును ఖాళీ చేయించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కర్ణాటక హుబ్లి జిల్లా మొరాబ్‌ అనే గ్రామంలో చెరువు ఉంది. ఆ గ్రామ ప్రజలకు ఆ చెరువు నీరే మంచినీటి ఆధారం.

ఆ చెరువు నీళ్లే గ్రామ ప్రజలు మంచి నీటినిగా వాడుతారు. అలాంటి చెరువులో అదే ప్రాంతంకు చెందిన 27 సంవత్సరాల ఒక మహిళ శవం కనిపించింది. ఆ శవం నీటిలో పడి చాలా రోజులు అయ్యిందేమో శరీరం పాక్షికంగా కుల్లి పోవడంతో పాటు, జంతువులు పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. దాంతో గ్రామస్తులు నీరు హెచ్‌ఐవీ తో కలుషితం అయ్యాయని అధికారులకు కంప్లైంట్‌ ఇచ్చారు.

అయితే అధికారులు మాత్రం వైధ్యుల సూచన మేరకు ఏం కాదని గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నం చేశారు. కాని గ్రామస్తులు మాత్రం ససేమేరా అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఆ నీటిని తాగలేం అంటూ గ్రామస్తులు భీష్మించుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళను చేశారు.

తాము తాగే నీరు కలుషితం అయ్యిందని, వెంటనే ఆ చెరువులోంచి నీరు పూర్తిగా తొలగించి, మళ్లీ కొత్త నీరు చేరాల్సిందే అంటూ కలక్టర్‌ వరకు వెళ్లారు. నీటిలో 8 గంటల కంటే ఎక్కువ సమయం హెచ్‌ ఐ వీ వైరస్‌ బతకదని వైధ్యులు సూచించారని, ఏం పర్వాలేదు, టెస్టులు కూడా చేయించాం మీరు భయపడాల్సిన పని లేదు అంటూ కలెక్టర్‌ సూచించినా కూడా వారు ఒప్పుకోలేదు. దాంతో చివరకు నీరు అంతా కూడా తోడాల్సి వచ్చింది. .

కలెక్టర్‌ ఆదేశాలతో ఆ చెరువులోని నీటిని దాదాపు 20 మోటర్లు పెట్టి ఒక రోజంతా తోడారు. ఆ తర్వాత పక్కనే ఉన్న మాలాభద్ర రిజర్వాయర్‌ నుండి నీటితో మళ్లీ చెరువును నింపారు.

తోడేసిన నీరు పంట పోలాలతో పాటు, కిందకు వదిలేశారు. మొరాబ్‌ గ్రామ ప్రజలు చెరువు నీటి కోసం చేసిన ఉద్యమం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయ్యింది.