పెళ్లితో ఒక్కటైన హెచ్ ఐ వీ జంటలు,ఎక్కడంటే!

ఎవరికైనా హెచ్ ఐ వీ వచ్చింది అంటే ఇక వారిని సమాజం నుంచి వెలివేసేంత పనిచేస్తారు జనాలు.ఎందుకంటే వారి పై సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.

 Three Hiv Positive Couples Marriage In Maharashtra, Hiv Positive Couples,maharas-TeluguStop.com

హెచ్ ఐ వీ వారిపై సానుకూలంగా ఉండాలి అంటూ ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పురావడం లేదు.దీనితో చాలా మంది హెచ్ ఐ వీ పాజిటివ్ రోగులు నిరాశలోనే బతుకీడిస్తున్నారు.

అయితే అలాంటి వారికి మహారాష్ట్ర పోలీసులు అండగా ఉంటున్నారు.వారికోసం ఒక సరికొత్త ఆలోచన కూడా చేశారు.

ఒంటరితనంతో బాధపడకుండా ఉండేందుకు పెళ్లి కార్యక్రమం నిర్వహించారు.ఇందులో మూడు హెచ్ఐవీ జంటలు మూడు ముళ్ల బంధంతో ఏకమైనట్లు తెలుస్తుంది.

పోలీసులు, అధికారులే పెళ్లి పెద్దలుగా మారి నూరేళ్లు జీవించాలంటూ ఆ జంటలను దీవించారు.మహారాష్ట్ర లోని బీడ్ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ పెళ్లిళ్ల ను జరిపించినట్లు తెలుస్తుంది.

హెచ్ ఐ వీ తో బాధపడుతూ పెళ్ళికి దూరంగా ఉంటున్న ముగ్గురు యువతులకు పెళ్లి చేయాలని నిర్ణయించింది.ఈ క్రమంలో పాజిటివ్ ఉన్న మరో ముగ్గురు యువకులకు ఇచ్చి వారికి పెళ్లి జరిపించారు.

మూడుముళ్ల బంధం తో వీరంతా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

వీరి సమాజం నుంచి ఎలాంటి వివక్ష లేకుండా ఓ తోడుతో కలసి ఉండాలనే తాము ఇలా చేశామని ఎస్పీ హర్ష పొదార్ తెలిపారు.

కాగా పెళ్లి చేసుకున్న ఈ జంటల్లో ఓ జంట దాదాపు 13 ఏళ్లుగా హెచ్ఐవీ పాజిటివ్ రోగులకు స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నారు.మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ.

జరిగిన ఈ ఆదర్శ వివాహం చూసి వీరి పెళ్లి చేసిన అధికారులను పలువురు అభినందిస్తున్నారు కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube