ఆ సీరియల్ కు గుడ్ బై చెప్పేసిన నిరుపమ్ పరిటాల.. అంత సులువుగా ఎం లేదంటూ?

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ ను కొంతమంది దర్శకులు ఏళ్ల తరబడి సాగదీస్తూ పోతూ ఉంటారు.కొంతమంది సీరియల్స్ లో అతి త్వరగా ముగిస్తూ ఉంటారు.

 Hitler Gari Pellam Serial End Nirupam Emotional Post Details,  Hitler Gari Pella-TeluguStop.com

అయితే తొందరగా ముగిసే సీరియల్ అతి తక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు.ఇక కొంతమంది సీరియల్ దర్శకులు ఆ సీరియల్ టిఆర్పి రేటింగ్ బట్టి కథను మరింత పెంచుతూ సాగదీస్తూ ఉంటారు.

అందుకు చక్కని ఉదాహరణ కార్తీకదీపం సీరియల్ అని చెప్పవచ్చు.ఇందులో డాక్టర్ బాబు, దీప ఎప్పుడెప్పుడు కలుస్తారా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూశారు.

కానీ వారిద్దరూ కలిసి పోయాక ఆ సీరియల్ కథ పూర్తిగా మారిపోయింది.

దర్శకుడు ఆ కథను ఎటు తీసుకెళ్లాలో తెలియక నడిసంద్రంలో వదిలేశాడు.

ఇక ఈ సీరియల్ తో నుంచి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు డాక్టర్ బాబు అలియాస్ నిరుపం పరిటాల. నిరుపం పరిటాల ఈ సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువయ్యాడు.

మరొకవైపు హిట్లర్ గారి పెళ్ళాం అంటూ 2020లో ఒక సీరియల్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇక ఆ సీరియల్ ద్వారా కూడా నిరుపం పరిటాల చాలా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఈ సీరియల్ కథ ని పెద్దగా సాగదీయకుండా అతి త్వరగానే ముగించేశారు.నేటితో చివరి ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఈ సందర్భంగా నిరుపం పరిటాల సోషల్ మీడియా హిట్లర్ గారి పెళ్ళాం ప్రయాణం గురించి చెబుతూ ప్రతి ఒక కథ ఏదో ఒక రోజు ముగిసిపోవాల్సిందే.హిట్లర్ గారి పెళ్ళాం కు ఎండ్ కార్డు పడింది.ఈ ప్రయాణము ఏమి పూలపాన్పు కాదు.ఎందుకంటే ఇది మాకు ఎన్నో విషయాలు నేర్పించింది.

అంతేకాకుండా సీరియల్ తో మాకు ఎన్నో జ్ఞాపకాలు కూడా ముడిపడి ఉన్నాయి.ప్రతి ఒక్క రోజు ఒక పాఠాన్ని నేర్పించింది.అలాగే మా ఈ ప్రయాణానికి తోడ్పడి మమ్మల్ని ఆదరించిన తెలుగు తమిళ మలయాళ కన్నడ ప్రేక్షకులకు థ్యాంక్స్ అంటూ నిరుపం పరిటాల పోస్ట్ చేశారు.నేడు ఈ సీరియల్ కు ముగింపు పలుకుతూ గుడ్ బై చెప్పనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube