చిన్నారిపై లైంగిక దాడి.. తప్పుడు ఆరోపణలు: భారత సంతతి పోలీస్‌కు మూడేళ్ల జైలు

ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు యూకేలోని భారత సంతతి పోలీస్ కానిస్టేబుల్‌కు అక్కడి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.42 ఏళ్ల హితేశ్ లఖాని మెట్రోపాలిటిన్ పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు.

 Hitesh Lakani America Kingston Krown-TeluguStop.com

2018 సెప్టెంబర్‌లో లండన్ సబర్బన్ ప్రాంతంలోని ఉక్స్‌బ్రిడ్జి ప్రాంతంలో తల్లి, ఐదేళ్ల చిన్నారి నడుచుకుంటూ వెళ్తున్నారు.తల్లి ముందు వుండగా.

వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి చిన్నారిని అపహరించి పొదల్లోకి లాక్కెళ్లినట్లుగా హితేష్ 101కి కాల్ చేసి తెలిపాడు.ఈ కేసుపై విచారణ సందర్భంగా కింగ్స్‌టన్ క్రౌన్ కోర్టు సదరు  కానిస్టేబుల్‌పై మండిపడింది.

కేసును తప్పుదారి పట్టించినందుకు అతనికి శిక్ష విధించింది.పోలీస్ అధికారిగా ఉన్న హితేష్ లఖాని పూర్తిగా కల్పితమైన, నిరాధారమైన వాదనలు చేసినట్లు సీనియర్ క్రౌన్ ప్రాసిక్యూటర్ డేవిడ్ డేవిస్ అన్నారు.

Telugu False Evidence, Indianorigin, Telugu Nri-Telugu NRI

ఘటన సమయంలో తాను నిందితుడిని చూసి, అతనిని ఫోటో తీశానని చెప్పాడు.అంతేకాకుండా అధికారులు స్టేట్‌మెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఫోటోను సమర్పించినట్లు వెల్లడించాడు.నిందితుడిని గుర్తించేందుకు గాను పోలీసులు స్థానిక సోషల్ మీడియాలో ఈ ఫోటోను పోస్ట్ చేశారు.ఇతనిని చూసినవారు  వెంటనే  క్రైమ్‌స్టాపర్లను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.అయితే దర్యాప్తు సమయంలో ఘటన జరిగిన ప్రదేశానికి పొరిగింట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో అక్కడ ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని తేలింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube