ఆ సెంటిమెంట్ వల్ల సంతోషంలో చరణ్, తారక్ ఫ్యాన్స్.. ఆర్ఆర్ఆర్ హిట్ అంటూ?

ప్రస్తుత కాలంలో ఒక స్టార్ హీరో ఒకే సినిమాకు దాదాపుగా నాలుగేళ్లు పరిమితం కావడం అంటే ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాలి.

అయితే ఎన్టీఆర్ మాత్రం రాజమౌళిపై ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల దాదాపుగా నాలుగేళ్లు ఆర్ఆర్ఆర్ సినిమాకు పరిమితమయ్యారు.

మార్చి 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా కరోనా తర్వాత అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లు సాధించే సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు స్టార్ హీరో రామ్ చరణ్ కూడా ఈ సినిమా కోసం కష్టపడ్డారు.చరణ్ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

అయితే మార్చి నెల సెంటిమెంట్ ప్రకారం ఆర్ఆర్ఆర్ కచ్చితంగా హిట్ అని చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా గతంలో తెరకెక్కి మార్చిలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.

Advertisement

ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆది సినిమా మార్చి నెల 28వ తేదీన విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమా కూడా మార్చి నెలలో విడుదలై విజయాన్ని అందుకుంది.

అందువల్ల ఆర్ఆర్ఆర్ తో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.మార్చి నెల ఇద్దరు హీరోల కెరీర్ లో మళ్లీ మెమరబుల్ మంత్ గా నిలుస్తుందేమో చూడాలి.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఎన్నో అంశాలను జక్కన్న రివీల్ చేయలేదని ఆర్ఆర్ఆర్ మూవీ తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఉంటుందని సమాచారం అందుతోంది.ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో 2,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు