హిట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు.. ఎంతో తెలుసా?  

Hit Movie First Weekend Collections - Telugu Collections, Hit Movie, Nani, Ruhani Sharma, Vishwak Sen

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ మూవీ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Hit Movie First Weekend Collections

ఇక ఈ చిత్ర టీజర్, ప్రోమో వీడియాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇక ఈ సినిమాకు తొలిరోజు మంచి రివ్యూలతో పాటు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉండటంత, ఆకట్టుకునే కథనం, అదిరిపోయే పర్ఫార్మెన్సులు ఈ సినిమాకు ప్రేక్షకులను రప్పించేలా చేశాయి.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.తొలి మూడు రోజులు ముగిసే సరికి ఈ సినిమా ఏకంగా రూ.3.57 కోట్ల మేర వసూళ్లు సాధించింది.

కాప్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సరసన రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది.

నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు.ఇక ఈ సినిమా తొలి మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.03 కోట్లు

సీడెడ్ – 29.5 లక్షలు

గుంటూరు – 26 లక్షలు

ఉత్తరాంధ్ర – 34.5 లక్షలు

ఈస్ట్ – 15 లక్షలు

వెస్ట్ – 15 లక్షలు

కృష్ణా – 24.5 లక్షలు

నెల్లూరు – 9.5 లక్షలు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు – 3.57 కోట్లు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు