హిట్ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. నిజంగానే హిట్ భయ్యా!

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన లేటెస్ట్ మూవీ ‘హిట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.పూర్తి కాప్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన సంగతి తెలిసిందే.

 Hit Movie Closing Collections-TeluguStop.com

ఈ హీరోకు హిట్ సినిమాతో అదిరిపోయే సక్సెస్ లభించింది.కాగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ యాక్టింగ్‌కు జనాలు ఫిదా అయ్యారు.

ఆకట్టుకునే కథాంశం, అదిరిపోయే సస్పెన్స్ అంశాలు కలగలిసి ఈ సినిమాకు మంచి టాక్‌ను తెచ్చిపెట్టాయి.ఇక ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు కూడా రావడంతో సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.ఇక ఈ సినిమా టోటల్ రన్ పూర్తి చేసుకున్న సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ.6.87 కోట్ల మేర వసూళ్లు సాధించింది.శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 3.05 కోట్లు

సీడెడ్ – 0.49 కోట్లు

వైజాగ్ – 0.66 కోట్లు

ఈస్ట్ – 0.32 కోట్లు

వెస్ట్ – 0.28 కోట్లు

కృష్ణా – 0.47 కోట్లు

గుంటూరు – 0.43 కోట్లు

నెల్లూరు – 0.19 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 5.89 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 0.26 కోట్లు

రెస్టాఫ్ వరల్డ్ – 0.72 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 6.87 కోట్లు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube