మరో రికార్డ్ సొంతం చేసుకున్న ‘హిట్ ‘ మ్యాన్…!  

Rohit Sharma New Record with 200 Sixers, rohit sharma, ipl, ipl 2020, hit man , new record, dhoni - Telugu Dhoni, Hit Man, Ipl, Ipl 2020, New Record, Rohit Sharma, Rohit Sharma New Record With 200 Sixers

ఐపీఎల్ 13 సీజన్ లో భాగంగా ఐదో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడింది.ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు కోల్కత్తా నైట్ రైడర్స్ పై 49 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

TeluguStop.com - Hit Man Rohit Sharma New Record 200sixers Ipl2020

ఇక ఇందులో రోహిత్ శర్మ తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో అలరించాడు.కేవలం 54 బంతులు ఆడిన రోహిత్ శర్మ 80 పరుగులను సాధించాడు.

ఇక ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 3 ఫోర్లు, ఆరు సిక్సర్లు సహాయంతో 80 పరుగులను చేయగలిగాడు.ఇదే క్రమంలోనే రోహిత్ శర్మ మరో రికార్డును అధిరోహించాడు.
ఐపీఎల్ లో 200 సిక్సర్ల ను పూర్తిచేసిన నాలుగో వ్యక్తిగా రోహిత్ శర్మ రికార్డు కెక్కాడు.ఈ మ్యాచ్ మొదలవగా ముందు రోహిత్ శర్మ 194 సిక్సర్లు చేసి ఉన్నాడు.

TeluguStop.com - మరో రికార్డ్ సొంతం చేసుకున్న హిట్ మ్యాన్…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ మ్యాచ్ లో మొత్తం ఆరు సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ మొత్తానికి 200 సిక్సర్లు చేసిన క్రికెటర్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.రోహిత్ శర్మ కంటే ముందుగా ఈ క్లబ్ లో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు.

రోహిత్ శర్మ నాలుగో వ్యక్తి.రోహిత్ శర్మ కంటే ముందుగా క్రిస్ గేల్, ఎంఎస్ ధోని, ఎబి డివిలియర్స్ ఉన్నారు.

ఇక ఈ లిస్టులో మొదటగా క్రిస్ గేల్ ఐపీఎల్ కెరియర్ లో మొత్తం 326 సిక్సర్లను బాదేశాడు.ఇక ఈ లిస్ట్ లో క్రిస్ గేల్ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఎబి డివిలియర్స్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు.

ఎబి డివిలియర్స్ 214 సిక్సర్లు సాధించాడు.ఆ తర్వాత మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 212 సిక్సర్లతో కొనసాగుతున్నాడు.

దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ నాలుగవ ఆటగాడిగా చేరాడు.ఇప్పటివరకు ఈ రికార్డు లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండగా భారత్ నుండి కేవలం ధోని మాత్రమే ఉండగా ఇప్పుడు ధోనికి తోడుగా రోహిత్ శర్మ కూడా చేరాడు.

ఇక ముంబై ఇండియన్స్ తన తర్వాత మ్యాచ్ ను సెప్టెంబర్ 28న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరగనుంది.

#Ipl 2020 #Hit Man #New Record #Dhoni #RohitSharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hit Man Rohit Sharma New Record 200sixers Ipl2020 Related Telugu News,Photos/Pics,Images..