ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాల పై స్పందించిన హిట్ మ్యాన్..!  

mumbai indians, kkr, ipl, ipl 2020, rohit sharma, dekak - Telugu Ipl, Ipl 2020, Kkr, Mumbai Indians, Rohit Sharma

ప్రస్తుతం యూఏఈ దేశంలో ఐపీఎల్ 13 వ సీజన్ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది.పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు మొదటి స్థానం కోసం వరుసగా మ్యాచ్లను గెలుస్తూ పాయింట్ల పట్టికలో ముందుకు వస్తున్నారు.

TeluguStop.com - Hit Man Responds To Mumbai Indians Successive Victories

ఇకపోతే తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్, కేకేఆర్ జట్లమధ్య మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల భారీ విజయాన్ని అందుకుంది.దీంతో మరోసారి పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు మొదటి స్థానానికి చేరుకుంది.

ఇకపోతే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది.తాజాగా గెలిచిన మ్యాచ్ తో ముంబై ఇండియన్స్ వరుసగా 5 విజయాలను అందుకుంది.

TeluguStop.com - ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాల పై స్పందించిన హిట్ మ్యాన్..-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.అయితే ఇందుకు సంబంధించి తాజాగా రోహిత్ శర్మ స్పందిస్తూ తమ ఆటగాళ్ళు అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది తనకు, తమ టీం యాజమాన్యానికి చాలా సంతోషం కలిగిస్తోందని చెప్పుకొచ్చాడు.మేము మా అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తున్నారని అందుకు తమ విజయాలే నిదర్శనం అని తెలిపాడు.

అంతేకాకుండా తాను డీకాక్ తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు చెబుతూనే… తాను ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని కచ్చితంగా ఫాలో అవుతున్నాడని డీకాక్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.ఇక తాజాగా ఐపీల్ లో మొదలైన సెకండ్ ఆఫ్ లో ఇదే రకమైన ట్రెండ్ కొనసాగిస్తామని రోహిత్ శర్మ చెబుతున్నాడు.

అంతేకాదు చేజింగ్ చేసే మ్యాచ్ లలో కచ్చితంగా ఎక్కువ విజయాలు సాధిస్తామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

తాజాగా జరిగిన మ్యాచ్ కు సంబంధించి కేకేఆర్ నూతన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.

మొదట్లో వికెట్లను త్వరగా చేజార్చుకోవడం ద్వారా మ్యాచ్ లో పుంజుకొలేకపోయమని, అయితే… ముంబై ఆటగాళ్లు చాలా బాగా ఆడారని చెప్పుకొచ్చాడు.ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల భారీ విజయాన్ని సాధించింది.చేదన లో ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 16.5 ఓవర్లలోనే కేకేఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు డికాక్ 78 పరుగులు, రోహిత్ శర్మ 35 పరుగులు చేయడంతో విజయాన్ని సులువుగా చేరుకున్నారు

.

#Ipl 2020 #Rohit Sharma #Mumbai Indians

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hit Man Responds To Mumbai Indians Successive Victories Related Telugu News,Photos/Pics,Images..