Hit 2 Adivi Sesh: బాక్సాఫీస్ దగ్గర 'హిట్ 2' టార్గెట్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ లో హిట్ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించారు.

 Hit 2 Pre Release Theatrical Business, Adivi Sesh, hit 2, Nani,vishwak Sen, hi-TeluguStop.com

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన సినిమాల్లో హిట్ 1 ఒకటి.విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించు కుంది.

ఈ సినిమా హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా రెడీ అయ్యింది.

సరిగ్గా ఏడాదికి మరొక సినిమాతో నాని నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు.

ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.ఈ సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు హిట్ 2 తెరకెక్కించాడు.

అయితే ఈసారి హీరోగా విలక్షణ హీరో అడవిశేష్ నటిస్తున్నాడు.క్షణం, గూఢచారి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత అడవి శేష్ ఇటీవలే మేజర్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

దీంతో ఈయన క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.హిట్ 2 ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచుకుంది.మరి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర నిర్మాత నాని ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారిపోయింది.

ఈ సినిమా బిజినెస్ వివరాలలోకి వెళ్తే.

Telugu Adivi Sesh, Pre, Pre Theatrical, Nani, Vishwak Sen-Movie

నైజాం లో 4 కోట్ల ధర పలికిన ఈ సినిమా సీడెడ్ లో 1.75 కోట్లు, ఆంధ్రాలో 4.5 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం.ఆంధ్రా తెలంగాణలో మొత్తం కలిపి 10.25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.ప్రపంచ వ్యాప్తంగా చుస్తే 14.25 కోట్ల వరకు బిజినెస్ చేసిందట.మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 15 కోట్ల వరకు రాబట్టాల్సిందే.చూడాలి డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పెనింగ్స్ ఎంత రాబడుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube