Puneeth rajkumar Karnataka Govt : పాఠ్యాంశంగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చరిత్ర?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి ఏడాది పూర్తి అయినప్పటికీ ఇంకా అభిమానులు ఈయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక పునీత్ మరణాంతరం ఆయన నటించిన సినిమాలు కూడా విడుదల కావడంతో ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా చాలామంది అభిమానులు తమ అభిమాన హీరోను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

 History Of Kannada Power Star Puneeth Rajkumar As A Lesson History ,kannada Powe-TeluguStop.com

ఇక ఈయన మరణాంతరం కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డును ప్రధానం చేసింది.

ఇకపోతే ఈయన కన్నడ చిత్ర పరిశ్రమలో కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు.

అయితే ఈ విషయాలు ఎక్కడ బయటకు చెప్పుకోలేదు.అయితే ఈయన మరణాంతరం ఈయన చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా తెలియడంతో ఈయన సినిమాలలోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అని నిరూపించుకున్నారు.

ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వానికి భారతినగర్‌ రెసిడెంట్స్‌ ఫోరం విజ్ఞప్తి చేసింది.

Telugu Bharatinagar, Kannada, Karnataka, Ns Ravi-Movie

ఫోరం అధ్యక్షుడు ఎన్‌ఎస్ రవి ఈ మేరకు సిఎం బసవరాజుకు లేఖరాశారు.ఈ లేఖలో భాగంగా పునీత్ వందలాది మంది నిరుపేద విద్యార్థులను తన సొంత డబ్బుతో చదివించారు.ఇలా ఎంతో గొప్ప మనసు ఉన్నటువంటి పునీత్ జీవిత కథ ఆధారంగా ఎంతోమంది విద్యార్థులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా ఈయన నేత్రదానం స్వయం ప్రేరిత రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహించారని అలాగే ఎన్నో వృద్ధాశ్రమాలను కూడా నడిపారని ఈ సందర్భంగా రవి కర్ణాటక ప్రభుత్వానికి రాసిన లేఖలు పొందుపరిచారు.ఇలాంటి గొప్ప మానవత మూర్తి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని తన నుంచి స్ఫూర్తి పొందాడానికే ఈయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు.

మరి ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube