ఫ్రెండ్ షిప్ డే ఎలా వచ్చిందో తెలుసా…? ఆగష్టు లోని మొదటి ఆదివారమే ఎందుకంటే.?

ఆగస్ట్ మొదటి ఆదివారం వచ్చిందంటే చాలు నైట్ 12 నుండే సెల్ ఫోన్ ఇన్ బాక్స్…లో హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అనే మెసేజ్ ల వరద వస్తూనూ ఉంటుంది.ఇక వాట్సాప్ లో అయితే ఓ పిక్.

 History Of Friendship Day Celebrations First Sunday Of August Month-TeluguStop.com

దాని కింద స్నేహానికి సంబంధించిన రెండు లైన్ల కామెంటరీ.ఇక ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే….

ఇక్కడ పిక్ కాకపోతే సెల్ఫ్ కామెంటరీ.ఇలా ఈ రోజు మొత్తం Happy FriendShip Day అంటూ స్తోత్రం చదివేస్తాం.

గ్రీటింగ్ కార్డులు, బ్రాస్ లేట్ లు , ఫ్రెండ్ షిప్ బాండ్ .ఇక మన స్నేహం మరింత బలంగా ఉండాలని కోరుతూ ఆత్మీయమైన ఆలింగనాలు.కలిసి కాఫీ తాగడాలు, లంచ్ కు బయటికి వెళ్లడాలు ఎవరి ప్లాన్స్ వాళ్లకు ఉంటాయ్ లేండి.అయితే అసలు ఫ్రెండ్ షిప్ డే ఎందుకు వచ్చిందో తెలుసా….?

అమెరికా ప్రభుత్వము 1935 ఆగస్టు మొదటి శనివారము ఓ వ్యక్తిని చంపింది .అతని మరణ వార్త విని ఆమరుసటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు .ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వము వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవము గా ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది.

స్నేహం అంటే.

వన్ బై టూ చాయ్ లే కాదు.సగం సగం తాగే కింగ్ సైజ్ సిగరేట్ కాదు.

అదో అనిర్వచనీయ బంధం.హృదయానికి సంబంధించిన ఫీలింగ్.

చచ్చే వరకు , చావు తర్వాత కూడా నీ వెంట ఉండే ఓ బలమైన బంధం స్నేహం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube