ప్రతి ఆర్టీసీ బస్సు నెంబర్ ప్లేట్ మీద 'Z' అనే అక్షరం ఎందుకుంటుందో తెలుసా.? తల్లికి గుర్తుగా.!     2018-09-30   11:17:21  IST  Sai Mallula

ఆర్టీసీ బస్సు…ఆగడు పోదు సమయానికి రాదు అని చిన్నప్పుడు సరదాగా అనుకునే వాళ్ళం. ఎంత తిట్టుకున్నా…చివరికి అదే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవాళ్ళం. నిత్యం కొన్ని లక్షల మంది దీని సేవలు అందుకుంటున్నారు. అయితే ఎప్పుడైనా ఆర్టీసీ బస్సుల నెంబర్ లు గమనించారా.? నెంబర్ అంటే 1v , 5k , 222 కాదండోయి. రోడ్డు రవాణా సంస్థ ఇచ్చిన నెంబర్ ప్లేట్ గమనించారా.? ఏ డిపోకి చెందినవైనా వాటిపై ‘జడ్‌’ అనే ఇంగ్లీషు అక్షరం మాత్రం తప్పకుండా ఉంటుంది. అయితే ఆ అక్షరం ఎందుకు ఉంది అని అంటే దాని వెనకాల పెద్ద స్టోరీ నే ఉంది. అదేంటో ఒక లుక్ వేసుకోండి!

History Behind Letter Z In Number Plate Registration Of RTC-

History Behind Letter Z In Number Plate Registration Of RTC

ఆ అక్షరం ఒక వ్యక్తి పేరుకు సూచన. నిజాం ప్రభువు మిర్‌ ఉస్మాన్ ఆలీ ఖాన్ నిజాం సంస్థానంలో బస్సు సర్వీసులను ప్రవేశపెట్టినపుడు తన తల్లి జరా బేగం (Zahra Begum) పేరుతో ఆ సంస్థను నిర్వహించాలని తలచాడట. కానీ అతడి మంత్రులు ఆ సంస్థ నిజాం వంశం పేరుతోనే ఉంటే మంచిదని చెప్పడంతో కనీసం తన తల్లి పేరులో మొదటి అక్షరం ‘జెడ్‌’ నైనా బస్సుల నంబర్‌ ప్లేటుపై ముద్రించాలని తీర్మానించాడట. ఆ తరువాత నిజాం సంస్థానాన్ని భారతదేశ ఆధీనంలోకి తీసుకుంటూ ఒప్పందం జరిగినప్పుడు కూడా ఈ అంశాన్ని చేర్చి దానికి చట్టబద్దత చేకూర్చాడట. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆర్టీసీ బస్సుల్లో ఎన్ని మార్పులు వచ్చినా నంబర్‌ ప్లేటు పై ‘జెడ్‌’ అక్షరం మాత్రం చెక్కుచెదరలేదు.