వంటగాళ్లు పెట్టుకునే టోపీకి వంద మడతలు ఎందుకు ఉంటాయి..?

వంటగాళ్లు లేదా చెఫ్‌లు మడతలతో కూడిన తెల్లటి పొడవాటి టోపీని ధరిస్తారు.ఈ టోపీలో 100 మడతలు కనిపిస్తాయి ఇలా అవి మరదలు మడతలు ఎందుకుంటాయా అనే సందేహం చాలా మందిలో కలిగే ఉంటుంది.

 History Behind Chef Hat Having 100 Folds Details, Chef Hat, 100 Folds, Chef Rank-TeluguStop.com

సాధారణంగా వంటగాళ్లు( Chefs ) పలు రకాల వంటకాలను ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు.ఇదే విషయాన్ని సింబాలిక్ గా చెప్పేందుకు అలా మడతలు టోపీ పై చూపిస్తారని అంటారు.

చెఫ్‌కు అన్ని రకాల వంటలను ఎలా ఉడికించాలో తెలుసు అని ఇది సూచిస్తుందని కొందరు వివరిస్తుంటారు.

టోపీ ఎత్తు చెఫ్ ర్యాంక్‌ను సూచిస్తుంది.టోపీ ఎంత ఎత్తుగా ఉంటే చెఫ్ ర్యాంక్( Chef Rank ) అంత ఎక్కువ అని అర్థం చేసుకోవాలి.చెఫ్ టోపీ( Chef Hat ) చరిత్ర గురించి తెలుసుకుంటే, 7వ శతాబ్దానికి చెందిన రాజు అషుర్బానిపాల్ తన ప్రధాన కుక్‌లను ఇతర కుక్‌ల నుండి వేరు చేయడానికి, వారి విధేయతను ప్రోత్సహించడానికి టోపీలను ధరించాలని ఆదేశించాడు.16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు హెన్రీ VIII తన ఆహారంలో వెంట్రుకలను కనుగొని ఒక చెఫ్‌ తలను నరికేశాడు.

ఈ సంఘటన తర్వాత, వంట చేసే సమయంలో చెఫ్‌లందరూ టోపీలు ధరించాలని హుకుం జారీ చేశాడు.వండిన ఆహారంలో వెంట్రుకలు రాలకుండా ఉండటానికి, వంటగదిలో( Kitchen ) శుభ్రత కోసం కూడా చెఫ్‌లు టోపీలను ఉపయోగించడం ప్రారంభించారు.1800 తర్వాత, వంటశాలలలో చెఫ్‌లు టోపీలు ధరించడం సాధారణమైంది.వారు తెల్లని టోపీలు ధరిస్తారు, ఎందుకంటే తెలుపు స్వచ్ఛతను సూచిస్తుంది.మొత్తం మీద వంట గాళ్ల టోపీ చరిత్ర అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

Why Are There 100 Pleats In A Chef's Hat

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube