నీర‌జ్ చోప్రాపై అలాంటి ప్ర‌శ్న‌లు వేసిన చ‌రిత్ర కారుడు.. భ‌గ్గుమంటున్న నెటిజ‌న్లు

జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన విశ్వ క్రీడా సంబురంలో భారత్ తరఫున పాల్గొన్న క్రీడాకారుడు నీరజ్ చోప్రా డిస్కస్ త్రో క్రీడాంశంలో గోల్డ్ మెడల్ సాధించిన సంగతి అందరికీ విదితమే.ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రాను దేశం మొత్తం అభినందించింది.

 Historian Who Asked Such Questions About Neeraj Chopra Frightening Netizens, Nee-TeluguStop.com

ప్రధాన మంత్రి, సెలబ్రిటీలు, సామాన్యులు అందరూ ఆయనకు అభినందనలు తెలిపారు.భారత కీర్తిన ప్రపంచానికి చాటి చెప్పినందుకుగాను నీరజ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కాగా, నీరజ్ చోప్రాను ఇటీవల కాలంలో మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు కూడా చేశాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యుయర్ క్రీడాకారుడు నీరజ్‌ను అభ్యంతరకర ప్రశ్నలు అడిగారు.

నీరజ్ చోప్రాను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడిగిన సదరు మీడియా సంస్థ, ఇంటర్వ్యుయర్ పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చరిత్రకారుడు రాజీవ్ సేథి ఇటీవల నీరజ్ చోప్రాను ఇంటర్వ్యూ చేశారు.

ఈ క్రమంలోనే నీరజ్‌ను అర్థం లేని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.నీరజ్ నీవింత సుందరమైన యువకుడివి కదా? మీరు మీ ట్రెయినింగ్‌ను సెక్స్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అని అడిగారు.కాగా ఈ ప్రశ్నకుగాను నీరజ్ అసహనం వ్యక్తం చేశారు.ఆన్సర్ ఇవ్వకుండా నిరాకరించారు.సారీ సార్ అని చెప్పి ప్రశ్నను దాటవేశాడు.

Telugu Abusiveneeraj, Gold Medal, Historianrajeev, Neeraj Chopra, Tokyo Olym-Lat

కాగా, ఈ వీడియో ట్విట్టర్ వేదికగా షేర్ కాగా, అది సోషల్ మీడియాలో వైరలవుతోంది.చరిత్రకారుడైన సేథి ఇలాంటి ప్రశ్న అడగడమేంటి ? అని నెటిజన్లు సేథిని విమర్శిస్తున్నారు.భారత దేశంలోని యువత, క్రీడాకారులు స్ఫూర్తిగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాను ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు అడగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే నీరజ్ చోప్రా మాత్రం ఈ విషయమై ఎలాంటి కామెంట్స్ చేయకుండా ఉన్నారు.అయితే, నెటిజన్లు మాత్రం చరిత్రకారుడు సేథి పట్ల ఫైర్ అవుతున్నారు.ఇంటర్వ్యూ చేయబోయే ముందర క్వశ్చన్స్‌ రీ చెక్ చేసుకోవాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube