బన్నీ డెడికేషన్ గురించి చెబుతున్న అతని డ్రైవర్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు.మెగా కాంపౌండ్ నుండి వచ్చినప్పటికీ తన నటనతో, డాన్సులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

 His Driver Talking About Bunny Dedication-TeluguStop.com

అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరో స్థాయికి వచ్చాడు.తనతో పని చేసే వ్యక్తులకు బాగా తెలుసు అల్లు అర్జున్ ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో.

ఒక్కసారి సెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత సీన్స్ పూర్తి అయ్యే వరకు చాలా డెడికేషన్ చూపిస్తాడని అందరు చెబుతుంటారు.తాజాగా అల్లు అర్జున్ క్యారవాన్ డ్రైవర్ లక్ష్మణ్ కూడా అల్లు అర్జున్ డెడికేషన్, హార్డ్ వర్క్ గురించి చెప్పాడు.

 His Driver Talking About Bunny Dedication-బన్నీ డెడికేషన్ గురించి చెబుతున్న అతని డ్రైవర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ టైమ్ లో అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో డ్రైవర్ లక్ష్మణ్ తెలిపాడు.
ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న కారణంగా షూటింగ్ మొత్తం దట్టమైన అడవిలో చేయాల్సి వచ్చింది.ఈ షూటింగ్ జరిగే అడవిలో అల్లు అర్జున్ క్యారవాన్ షూటింగ్ స్పాట్ వరకు చేరుకునేది కాదు.

అందువల్ల అల్లు అర్జున్ రోజు బైక్ మీద ఆ షూటింగ్ స్పాట్ కు వెళ్ళేవాడిని అతడు తెలిపాడు.ఈ షూటింగ్ స్పాట్ చేరుకోవడం కోసం అల్లు అర్జున్ ఉదయం 3 గంటలకే నిద్రలేచి వెళ్లేవాడట.

షూటింగ్ స్పాట్ చేరుకోవడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుందట.ఈ షూటింగ్ జరిగినంతకాలం అల్లు అర్జున్ బైక్ మీదే వెళ్ళేవాడిని లక్ష్మణ్ తెలిపాడు.అర్ధరాత్రి వరకు షూటింగ్ చేసిన మళ్ళీ ఉదయం మూడు గంటలకే లేచి షూటింగ్ స్పాట్ కు వెళ్ళే వాడని అప్పుడే అతడి డెడికేషన్, హార్డ్ వర్క్ గురించి అర్థమైందని లక్ష్మణ్ తెలిపాడు.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ కు కరోనా సోకినా కారణంగా షూటింగ్ నిలిపివేశారు.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

#Pushpa #HisDriver #Allu Arjun #Sukumar #AlluArjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు