త‌న వైక‌ల్య‌మే.. త‌న‌ ఆయుధం..!

అతను అందరిలాగానే పుట్టాడు.కానీ చేతికి రెండే వేళ్లతో పుట్టాడు.

 His Disability His Weapon, Viral Latest, Viral News, Social Media, Painting, Ta-TeluguStop.com

దీంతో చిన్నప్పటినుంచి అన్నం తినాలన్నా.మరే పనిచేసుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు పడేవాడు.

పుట్టుకతోనే చేతికి రెండే వేళ్లతో పుట్టిన లూథియానాకు చెందిన హర్జిత్ సింగ్ చాలా ఇబ్బందులు పడేవాడు.కానీ కష్టాలు ఉన్నాయి కదా అని అతను ఎప్పుడు దిగులు పడలేదు.

చేసే పనుల్లో ఇబ్బందులున్నాయని ఆగిపోలేదు.తన వైకల్యన్ని త‌న ఆయుధంగా మార్చుకున్నాడు.

చేతికి ఉండాల్సిన 5 వేళ్లు లేకుండా ఉంటే ఏంటీ.!? ‘రెండు వేళ్లు’ ఉన్నాయిగా అనుకున్నాడు.అవికూడా లేకుండా పుట్టినవారి కంటే నేను చాలా బెటర్ అనుకున్నాడు.అలా అతని ఆలోచనల నుంచి అత్యద్భుతమైన కళాఖండాలను సృష్టించాడు.ఆ రెండు వేళ్లతోనే పెన్సిల్ పట్టుకున్నాడు.మొదట్లో చాలా కష్టమయ్యేది.

కానీ హర్జిత్ సింగ్ సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది.

అద్భుతమైన బొమ్మలు వేయటం ప్రారంభించాడు.

అలా అతని ‘చేతి వేళ్ల’ నుంచి జాలువారిని చిత్రాలను ఆన్లైన్ లో అమ్మానికి పెట్టి చక్కగా సంపాదిస్తున్నాడు.హర్జిత్ వాటర్ కలర్స్ తోను పాటు పెన్సిల్ తో కూడా హర్జిత్ సింగ్ బొమ్మలు వేస్తాడు.

ఆ చిత్రాలు చూస్తే చేయి తిరిగిన చిత్రకారులు వేశారా.?అనిపిస్తుంది.ఈ సందర్భంగా హర్జిత్ సింగ్ మాట్లాడుతూ.నేను పుట్టుకతోనే రెండు వేళ్లతో పుట్టాను.నేను ఎదిగే కొద్ది చేసుకునే పనులు కాస్త కష్టమయ్యేవి.కానీ రెండు వేళ్లతోనే అవి ఇవీ పట్టుకోవటం.

పని చేయటం అలవాటు చేసుకున్నానని తెలిపాడు.చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం.

అలా పెయింటింగ్ వేయాలంటే రెండు వేళ్లతో చాలా ఇబ్బంది పడేవాడిని.కానీ నిదానంగా అలవాటు చేసుకున్నాను.

నా కుటుంబ సభ్యులు, స్కూల్లో టీచర్లు, తోటి విద్యార్ధుల ప్రోత్సాహంతో పెయింటింగ్ వేయటం నేర్చుకున్నాను.కానీ పెన్సిల్ షేడింగ్ చాలా కష్టమని కానీ నాకు అదే ఇష్టమని తెలిపాడు హర్జిత్ సింగ్.పెన్సిల్ తో వేయటం చాలా కష్టం.చాలా ఓపిక కావాలి.చాలా ఏకాగ్రత కావాలి.అలా చేస్తేనే చక్కటి పెయింటింగ్ వేయగలమని తెలిపాడు.

మొదట్లో కార్టూన్లు తయారు చేసేవాడిని.ఆ తరువాత ఇలా పెయింటింగ్ వేస్తున్నానని.

, ఆన్లైన్ లో అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నానని తెలిపాడు హర్జిత్ సింగ్.చూశారా.? సంకల్ప బలం ఉంటే అంగ వైకల్యంకూడా ఎలా తల వంచుతుందో నిరూపించాడు హర్జిత్ సింగ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube