వామ్మో.. అతని కార్ల విలువ రూ.40 వేల కోట్లట!

సాధారణంగా పెద్ద పేరుమోసిన వ్యాపారులు, ధనవంతులకు ఎంత ఖరీదు చేసే కార్లు ఉండడం సాధారణమే.కానీ ఏకంగా 40 వేల కోట్ల విలువ చేసే కార్లు ఉండడం విశేషం.

 Cars ,worth Rs 40,000 Crore,600 Rolls Royce Low, 570 Mercedes Benz, 450 Ferrari-TeluguStop.com

అతని దగ్గర దాదాపుగా 600 రోల్స్ రాయిస్ లూ, 570 మెర్సిడెస్ బెంజ్ లు, 450 ఫెరారిలు,380 బెంట్లీలు, 200 బీఎండబ్ల్యూలు,170 జాగ్వర్ లు ఇవన్నీ కేవలం నోటి లెక్కలు మాత్రమే, ఇవి కాకుండా అతని దగ్గర మరి కొన్ని వేల కార్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు… ఇంతటి విలువైన కార్లు ఉన్న ఆ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా? ఆ వ్యక్తి బ్రునై సుల్తాన్‌.

సాధారణంగా కొంతమంది వారికి ఇష్టమైన వస్తువులను సేకరించడం అలవాటుగా ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే బ్రునై సుల్తాన్‌ కి కార్లు అంటే అంత మోజు.ప్రపంచంలో ఎక్కడ ఖరీదైన కారు వచ్చిన ఆ కారు తన ముందు ఉండాల్సిందే.

ప్రపంచంలో ఎవరూ సేకరించని కార్లను ఇతను సేకరించి తన గ్యారేజ్ లో నింపేస్తుంటాడు.అయితే వాటిలో కొన్ని తన ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు.1989లో ఫెరారి కంపెనీ డిజైన్‌ చేసిన రెండు మైథాస్‌ కార్లూ సుల్తాన్ దగ్గరే ఉన్నాయట.అన్ని ఫెరారి కార్లకీ స్టీరింగ్‌ ఎడమవైపునే ఉంటుంది.

కానీ సుల్తాన్ కోరిక మేరకు ఫెరారి కార్లకీ స్టీరింగ్ కుడి వైపు ఉండేలా డిజైన్ చేసిందట.

అంతేకాకుండా బెంట్లీ కంపెనీ సాధారణంగా ఎస్‌యూవీలు డిజైన్‌ చేయదు.

కానీ సుల్తాన్ అలాంటి కార్లు కావాలని కోరడంతో ఏకంగా అతనికి ఆ కంపెనీ డొమినేటర్‌ పేరుతో ఆరు ఎస్‌యూవీలనీ డిజైన్‌ చేసి ఇచ్చిందట.ఇలా ఎన్నో కార్లను తనకు ఇష్టమైన రీతిలో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు.

ఇక సుల్తాన్ పెళ్లి ఊరేగింపు కోసం సుమారు 104 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోల్స్ రాయిస్ కారు కొని, తరువాత ఆ కారుకు స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం తో పూత పూయించారు.ఆ బంగారం విలువ ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు.

ఆయన సేకరించిన కార్లన్నీ దాదాపు ఐదురహస్య ప్రదేశాలలో కనీసం వంద గ్యారేజ్ లలో ఉన్నాయని చెబుతుంటారు.ఇటీవల కొన్ని కార్లు దెబ్బతిన్నాయని ఆటోమొబైల్ నిపుణులు కనుగొన్నారు.సుల్తాన్ ఒక కార్లు మాత్రమే కాకుండా, ఆయన బంగ్లా, విమానం అన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన వస్తువులే.అంతేకాకుండా ఈ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద నివాస రాజభవనము సుల్తాన్ దే.ఇంతకీ రాజభోగం అనుభవిస్తున్న రాజుగారి విలాసాలకు, సిరిసంపదలకు కారణం అక్కడి చమురు నిల్వలే.20వ శతాబ్ద ప్రారంభంలో అక్కడ బయటపడిన చమురు నిల్వలు రాజుగారి సంపదలకు కారణమయ్యాయి.అంతేకాకుండా గత ఆరు వందల సంవత్సరాలుగా ఒకే కుటుంబం ఈ దేశాన్ని పాలించడం వల్ల సుల్తాన్ రాజు ఇంతటి సంపదలతో తులతూగుతూ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube