సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి రానున్న అంబాసిడర్

ఒకప్పడు దేశంలో ఏ ధనవంతుల ఇళ్లలో చూసినా అంబాసిడర్ కార్లు కనిపించేవి.వీటిలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు కూడా తిరిగేవారు.

 Hindustan Motors Launching Iconic Car Ambassador With New Look And Design Detail-TeluguStop.com

ఎంతో హుందాతనంగా, దర్జాగా కనిపించే ఈ అంబాసిడర్ కార్లకు మార్కెట్‌లో రాను రాను నష్టాలు తలెత్తాయి.దీంతో విధిలేని పరిస్థితుల్లో ఈ కార్ల ఉత్పత్తిని హిందుస్థాన్ మోటార్స్ ఆపేసింది.

ఈ వార్త విన్న ఎందరో బాధ పడ్డారు.అంతలా అంబాసిడర్ అందరి హృదయాలలో స్థానం సంపాదించుకుంది.

ఇక తాజాగా ఈ కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.సరికొత్త డిజైన్‌తో, ఆకట్టుకునే లుక్‌తో దర్శనమివ్వనుంది.

ఒకానొక సమయంలో భారత కార్ల పరిశ్రమలో రారాజుగా వెలుగొందిన ఈ అంబాసిడర్ కారు తిరిగి తన స్థానాన్ని ఆక్రమించుకోవడానికి తహతహలాడుతోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఐకానిక్ అంబాసిడర్ రెండేళ్లలో సరికొత్త రూపంలో తిరిగి రానుంది.హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్యుగోట్ సంస్థలు ఈ సరికొత్త అంబాసిడర్‌కు సంయుక్తంగా రూపకల్పన చేస్తున్నాయి.

క్లాసిక్ కార్ కొత్త మోడల్‌ను చెన్నైలోని హిందుస్థాన్ మోటార్స్ కంపెనీలో తయారు చేస్తున్నారు.హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ సీకే బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ.ఈ కంపెనీకి సంబంధించిన హెచ్‌ఎం డైరెక్టర్ ఉత్తమ్ బోస్ ఇటీవల మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు.‘న్యూ లుక్’తో అంబాసిడర్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.కొత్త ఇంజిన్, మెకానికల్, డిజైన్ వర్క్ అధునాతనంగా ఉన్నట్లు పేర్కొన్నారు.హిందుస్థాన్ మోటార్స్ నుంచి గతంలో అంబాసిడర్ కార్లను జపాన్‌కు చెందిన మిత్సుబిషి సంస్థ ఉత్పత్తి చేసేది.

మార్కెట్‌లో కొత్త కొత్త కార్లు, వైవిధ్యమైన డిజైన్లతో రావడంతో ఈ అంబాసిడర్ కార్లకు ఆదరణ తగ్గింది.

Telugu Ambassador, Ambassadorcar, Cars, Iconiccar, Latest, Design-Latest News -

సంస్థను మూసేసిన తర్వాత తిరిగి అంబాసిడర్ కార్లను ఉత్పత్తి చేసేందుకు ఫ్యుగోట్ సంస్థతో హిందుస్థాన్ మోటార్స్ కలిసింది.సెప్టెంబరు 2014లో హిందుస్థాన్ మోటార్స్ నుంచి చివరి అంబాసిడర్ కారు బయటకు వచ్చింది.భారీ అప్పులు, మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతో 2014లోనే అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది.2017లో హిందుస్థాన్ మోటార్స్‌ను సీకే బిర్లా గ్రూప్ రూ.80 కోట్లకే దక్కించుకుంది.అంబాసిడర్ భారతదేశంలో 1960ల నుండి 1990ల మధ్యకాలం వరకు ఒక స్టేటస్ సింబల్‌గా ఉండేది.ఇది మార్కెట్లో అత్యధికంగా ఉత్పత్తి చేయబడిన ఏకైక లగ్జరీ కారు.2013-14లో ఉత్పత్తిని నిలిపివేసినప్పుడు, వార్షిక విక్రయాలు 1980ల మధ్యకాలంలో 20,000 యూనిట్ల నుండి 2,000 యూనిట్లకు తగ్గాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube