వైట్‌హౌస్‌లో అమిత్ జానీకి కీలక పదవి.. రెండు భారతీయ అమెరికన్ ఎన్జీవోల అభ్యంతరం

భారత సంతతికి చెందిన అమిత్ జానీని హోంలాండ్ సెక్యూరిటీ విభాగానికి వైట్‌హౌస్ అనుసంధానకర్తగా నియమిస్తే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ నియామకం పట్ల అమెరికా కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న భారతీయ ఎన్జీవో సంస్థలు హిందూస్ ఫర్ హ్యుమన్ (హెచ్ఎఫ్‌హెచ్ఆర్), ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (ఐఏఎంసీ)లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.

 Hindus For Human Rights And Indian American Muslim Council Condemn Biden’s Cho-TeluguStop.com

ఈ మేరకు అమిత్ జానీ నియామకాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

హిందూ జాతీయవాదంతో ఆయనకు సంబంధాలు వున్న దృష్ట్యా.

జానీ నియామకం ముస్లిం సమాజానికి , ప్రత్యేకించి భారతీయ అమెరికన్ ముస్లింలకు తీవ్ర ఆందోళన కలిగించే సందేశాన్ని పంపుతోందని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు సయ్యద్ అలీ అన్నారు.హిందూ జాతీయవాద సంబంధాలు వున్న వ్యక్తులను కీలక స్థానాల్లోకి చేర్చడం ద్వారా బైడెన్ యంత్రాంగం కలవరపాటుకు గురిచేస్తోందని ఆయన అన్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్‌లో భారతీయ అమెరికన్ ఆర్ధికవేత్త సోనాల్ షా నియమితులైన కొద్దినెలలకే జానీ నియామకం జరిగిందని ఈ రెండు సంస్థలు చెబుతున్నాయి.జానీ, అతని కుటుంబ సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వాలకు మద్ధతు ఇస్తున్నారని హెచ్ఎఫ్‌హెచ్ఆర్ ఆరోపించింది.అంతేకాకుండా భారత్‌లోని హిందూ జాతీయవాద సంస్థలతో లోతైన కుటుంబ సంబంధాలను కలిగి వున్నారని వ్యాఖ్యానించింది.

2019లో ‘‘ ది ఇంటర్‌సెప్ట్ ’’.జానీ హిందూ జాతీయవాద సంబంధాలపై నివేదించింది.ఇతర విషయాలతో పాటు జానీ సరిగ్గా సోషల్ మీడియాలో మోడీ తిరిగి ఎన్నికైన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారని హెచ్‌ఎఫ్‌హెచ్ఆర్ తెలిపింది.

జానీ అనేక సందర్భాల్లో మోడీతో వున్న ఫోటోలు పోస్ట్ చేశాడని.కాశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తిని మోడీ ప్రభుత్వం 2019లో ఆగస్టులో రద్దు చేసినందుకు సంబరాలు జరుపుకునే ఈవెంట్‌ పోస్టర్‌లో ఆయన పేరు కనిపించిందని హెచ్‌ఎఫ్‌హెచ్ఆర్ పేర్కొంది.

2014లో మోడీ అమెరికా పర్యటనకు ముందు మోడీని సృజనాత్మక ఆలోచనలు, దూరదృష్టి గల నాయకుడిగా జానీ ప్రశంసించారు.అలాగే నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పోల్చారు.

దీనికి ప్రతిస్పందనగా.బైడెన్ ఎన్నికల ప్రచారం నుంచి అమిత్ జానీని తొలగించాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన పిటిషన్‌పై 7000 మంది సంతకాలు చేశారు.

Telugu Amit Jani, Hindusindian, Indianamerican, Joe Biden-Telugu NRI

హెచ్ఎఫ్‌హెచ్ఆర్ పాలసీ డైరెక్టర్ రియా చక్రవర్తి మాట్లాడుతూ.ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా హింసకు దూరంగా పారిపోతున్న ముస్లింలకు వైట్‌హౌస్‌లో ఉదారమైన ఇమ్మిగ్రేషన్ పాలసీ కోసం బలమైన న్యాయవాది అవసరమన్నారు.కానీ మోడీకి జానీ మద్ధతు వల్ల అతనిని అమెరికాలో నివసిస్తోన్న ముస్లింలకు నమ్మదగని న్యాయవాదిగా చేస్తుందని రియా చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube