బాలయ్యని తప్పించి లోకేష్ కి అప్పగించి..వారెవ్వా బాబోరు..!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు అంటారు అయితే ఒకడుగు ముందుకు వేసిన చంద్రబాబు రాజకీయాల్లో నాకు వియ్యంకుడు అయినా ఎన్టీఆర్ కొడుకైనా ఎవరైనా సరే ఒక్కటే అంటున్నారు.ఎందుకు.?.ఏమిటి.?…ఎలా.? అంటారా.అయితే అసలు విషయంలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా కలవర పెడుతున్న వార్త ఇప్పడు రాజకీయవర్గాలలో జోరుగా వినిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో బాలయ్యకి బహుశా బాబు హ్యాండ్ ఇవ్వడం కాని లేదా బాలయ్యని హిందూపురం బరినుంచీ తప్పించడం గానీ జరుగుతుందట

 Hindupur Mla Ticket Confirmed For Nara Lokesh-TeluguStop.com

ఏంటి షాక్ అయ్యారా అవును ఈ వార్త ఇప్పుడు తెలుగుదేశం నేతల్లో గుబులు పెంచుతోందట అందుకు కారణం కూడా ఉండనే ఉందని అంటున్నారు…ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు హిందూపురం పై వచ్చిన రిపోర్ట్ చూసి గుండె జారి మొకాలులోకి వచ్చినంత పని అయ్యిందట.టీడీపీ కంచుకోటల్లో ప్రధానమైన నియోజకవర్గం హిందూపురం అలాంటిది వచ్చే ఎన్నికల్లో బాలయ్య ని గనుకా అక్కడి నుంచీ మళ్ళీ బరిలోకి దింపితే ఓటమి తప్పదని తెలిసిందట దాంతో బాబు బాలయ్యని తప్పించే పనిలో పడ్డారట.అయితే

టీడీపీలో మరొక వర్గం మాత్రం బాలయ్యని తప్పించడానికి అసలు రీజన్ వేరే ఉందని అంటున్నారట ఇంతకీ అసలు రీజన్ ఏమిటంటే.

చంద్రబాబు గారాల పుత్రుడు ఏపీ ఐటీ శాఖామంత్రి లోకేష్ ని వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచీ పోటీ చేయించాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న బాబుకి తిరుగులేని అస్త్రంగా కనిపించింది హిందూపురం ముందుగా లోకేష్ ని పెనమలూరు నుంచీ పోటీ చేయించాలని చూసినా అక్కడ కూడా లోకేష్ కి అనుకున్నంత గెలుపు ఉండదని తేలడంతో.బాబు

బాలకృష్ణ హిందూపురం పై కన్నేశాడు దాంతో బాలయ్యని పెనమలూరు పంపడం కాని లేక ఈ సారి టిక్కెట్ ఇవ్వకుండా ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఎమ్మెల్సీ ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్నారట అయితే హిందూపురం లో టీడీపీకి ఎదురు ఉండదు.

అక్కడ లోకేష్ మాత్రమే కాదు టీడీపీ బరిలో ఒక మోస్తరు నేతని నుంచో పెట్టినా అక్కడి ప్రజలు పట్టం కట్టేది టీడీపీకి దాంతో లోకేష్ ని అక్కడి నుంచీ గెలిపించుకోవాలని బాబు తెగ ఉబలాట పడుతున్నారట…అందుకే బాలయ్యని తప్పుడు రిపోర్ట్ చూపించి తప్పించాలని బాబు ప్లాన్ వేశారని టాక్ వినిపిస్తోంది ఇప్పటికైనా బాలయ్య బాబు రాజకీయం తెలుసుకోవడం బెటర్ అంటున్నారు పార్టీలోని ఎన్టీఆర్ అభిమానులు.

ఈ క్రమంలోనే తన వియ్యంకుడు బాలకృష్ణకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలా? వద్దా? అనే సందేహంలో ఉన్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం బాలయ్య హిందూపురం అసెంబ్లీ సభ్యునిగా ఉన్నారు…హిందూపురం అంటే టీడీపీ కి కంచుకోట అలాంటిది బాలయ్య ఎన్నికైన సమయం నుంచీ సినిమాలతో బిజీ బిజీగా గడిపారు తప్ప ఏనాడు కూడా తన నియోజకవర్గానికి సమయం కేటాయించలేదని అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

అంతేకాదు కొంతమంది నేతలు కూడా అక్కడ నియంతలుగా వ్యవహరిస్తూ బాలకృష్ణ కి అపఖ్యాతి తెచ్చారు ఈ విషయం అందరికి తెలిసిందే అయితే ఇటువంటి పరిస్థితుల్లో బలయ్యకి గనుకా టిక్కెట్టు ఇస్తే తెలుగుదేశం చరిత్రలో హిందూపురం నుంచీ ఓటమి చవి చూడాల్సి వస్తుందనే భయం బాబుని వెంటాడుతోందట ఇదే విషయాన్నీ స్థానిక నేతలు సైతం బాబు దగ్గర చెప్పడంతో పాటు ఇంటలిజెన్స్ రిపోర్ట్ కూడా బాబు భయపడుతున్నట్టుగా రావడంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారట.

ఈ నేపథ్యంలో బాలయ్యను హిందూపురం నుంచి తప్పించి పెనమలూరు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు…అయితే పార్టీ క్రింది స్థాయి వ్యక్తులు మాత్రం లోకేష్ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చి మరీ హిందూపురం బరి నుంచీ బాలయ్యని తప్పించినట్టుగా టాక్ వినిపిస్తోంది.ఎందుకంటే హిందూపురం లో గెలుపు అంటే నల్లేరు మీద నడకలా ఉంటుందన్న విషయం అందరికి తెలుసు అంతేకాదు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే స్థానంలో ఎవరిని కూర్చో పెట్టినా ప్రజలు బ్రహ్మరధం పడుతారు అనడంలో సందేహం లేదు దాంతో ఈ స్థానం నుంచీ తానె పోటీ చేయాలని లోకేష్ డిసైడ్ అయ్యి తన మామకే ఎర్త్ పెట్టాడు అంటే టాక్ టీడీపీ వర్గాలలో జోరుగా విన్పిస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube