బాలకృష్ణకు చుక్కలు చూపించిన గ్రామస్థులు  

Hindupur Mla Balakrishna Stopped By Galibipalli Villagers - Telugu Balakrishna, Galibipalli, Hindupur Mla, Lepakshi, Villagers

హీరో కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది.హిందుపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బాలయ్య తీరుపై కొందరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను నడిరోడ్డుపై అడ్డుకున్నారు.

Hindupur Mla Balakrishna Stopped By Galibipalli Villagers - Telugu Balakrishna, Galibipalli, Hindupur Mla, Lepakshi, Villagers-Political-Telugu Tollywood Photo Image

తాజాగా జరిగిన ఈ ఘటన లేపాక్షి మండలంలో చోటు చేసుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాళ్లోకి వెళ్తే.

లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిపి సంవత్సరం గడుస్తున్నా ఇంకా పనులు మొదలుపెట్టకపోవడంతో గలిబిపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హిందుపురం వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు లేపాక్షి-హిందుపురం రోడ్డుపై బైఠాయించారు.

బాలయ్య వాహనాన్ని అడ్డుకుని తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం పూర్తి చెయ్యాలని కోరారు.

వీలైనంత త్వరగా గలిబిపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులు చేపడతానని బాలయ్య హామి ఇవ్వడంతో గ్రామస్థులు వెనుదిరిగారు.కాగా అటుపై బాలయ్య టీడీపీ అధికార ప్రతినిథి రమేష్ కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.బాలయ్యకు ఘన స్వాగతం పలికారు ఆయన అభిమానులు.

తాజా వార్తలు

Hindupur Mla Balakrishna Stopped By Galibipalli Villagers-galibipalli,hindupur Mla,lepakshi,villagers Related....