మన భారత్ లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయ్.మనం ఎన్నో విషయాలను చూసి ఆశ్చర్యపోయ్ ఆనంద పడుతుంటాం.
అలా ఆనందపడే విషయాల్లో ఒకటి హిందూ, ముస్లింలు కలవడం.వీరు ఇద్దరు కలిసి ఉన్న.
కలిసి తిరిగిన.ఒకే దైవానికి ఇద్దరు ఒకేసారి పూజ చేసిన చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.
వావ్.మనం ఊహించిన భారత్ ఇదే కదా అని ముచ్చటేస్తుంది.
ఇక అలాంటి ఘటనే నిన్న దసరా పండగలో జరిగింది.
ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
అందరి చేత వావ్ అనిపిస్తుంది.ఏంటి ఆ ఫోటో అని అనుకుంటున్నారా? అదేనండీ.దుర్గ పూజను హిందూ, ముస్లిం లు కలిసి చేశారు.ఇంతకంటే అద్భుతం ఇంకా ఏదైనా ఉంటుందా చెప్పండి.అవును అందుకే దీనికి సంబంధించి ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
త్రిపుర రాజధాని అగర్తలలోని ఓ స్లమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
హిందూ ముస్లింలు ఐక్యత చాటుకున్నారు.
దుర్గ పూజను కలిసికట్టుగా చేసి వారి మాత సామరస్యాన్ని చాటుకున్నారు.ఇక్కడ మరో విశేషం ఏంటంటే.
గత 19 సంవత్సరాలుగా వారు విజయదశమి నాడు ఇలా పూజలు నిర్వహిస్తున్నారట.ఇక అక్కడ దాదాపు 59 స్లమ్‌లు ఉండగా వారంతా కలిసి తులార్ మాత్‌లోని మైదానంలో దుర్గా మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రతి ఏటా చందా వసులు చేసి ఎంతో నిష్ఠగా దుర్గామాత పూజ చేస్తున్నారు ముస్లిం హిందువులు కలిసి.
ఇక ఈ దుర్గ పూజ కమిటీ కూడా ఉంది.
అందులో 31 మంది కమిటీ సభ్యులు ఉండగా 18 మంది ముస్లింలు, 13 మంది హిందువులు ఉన్నారు.ఇక దుర్గ మాత పూజ కోసం గత ఏడాది లక్ష ఇరవై వేల రూపాయిలు చందా వసూలు అవ్వగా ఈ ఏడాది కేవలం 80 వేల రూపాయిలు చందా వసులైనట్టు.
కరోనా వైరస్ కారణంగానే తగ్గినట్టు దుర్గ పూజ కమిటీలోని ఓ సభ్యుడు తెలిపాడు!
.