ఆవు మాంసం తిన్న ఎన్నారై ..ఏమి చేశాడో తెలుసా...!  

  • న్యూజిలాండ్ లోని కౌంట్ డౌన్ సూపర్ మార్కెట్ కి వెళ్ళిన ప్రవాస భారతీయుడు అయిన జస్వీందర్ పాల్ వ్యక్తి గత ఏడాది ఓ ధుఖాణం నుంచీ మాంసాన్ని కొనుగోలు చేశాడు. ఆ ప్యాకెట్ పై గొర్రె మాంసం అని ఉండటంతో అతడు ఇంటికి తీసుకుని వెళ్లి వండి తిన్నారు.అయితే అది తిన్న తరువాత కాని తెలియలేదు ఆవు మాంసం అని.

  • దాంతో సదరు వ్యక్తి తీవ్ర మనోవేదనకి గురయ్యాడు. హిందూ ఆచారాల ప్రకారం ఆవు మాంసం తినడం పాపం దాంతో అతడు తమ మత ఆచారాలను అపచారం చేశానంటూ ఆవేదన చెందాడు. వెంటనే తాను భారతదేశం వెళ్లి తాను చేసిన తప్పును ప్రక్షాళన చేసుకోవాలని అయితే తన పర్యటనకి అయ్యే ఖర్చుని సూపర్ మార్కెట్ వాళ్ళే భరించాలని డిమాండ్ చేశాడు.

  • Hindu Man Eats Beef Mislabeled As Lamb By Supermarket-Countdown Hindu New Zealand

    Hindu Man Eats Beef Mislabeled As Lamb By Supermarket

  • అయితే సూపర్ మార్కెట్ వాళ్ళు ఈ తప్పు ఎలా జరిగిందే విచారిస్తున్నామని తెలిపారు. అందుకు ప్రతిగా నష్ట పోయిన భారతీయుడికి రెండు వందల డాలర్లు విలువ చేసే గిఫ్ట్ ఓచర్‌ను ఇస్తామని అన్నారు. అయితే పాల్ మాత్రం తనకి అవేమీ వద్దని తాను భారత్ వెళ్లి పూజలు చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తం సూపర్ మార్కెట్ భరించాలని పట్టు పట్టాడు.