'కలిసి' కనిపిస్తే..పెళ్లైపోతుంది!!!

మళ్లీ మొదలయింది…హిందూ మహాసభ మళ్లీ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేసింది.విషయం ఏమిటంటే.

 Hindu Mahasabha Warns Lovers-TeluguStop.com

ఫిబ్రవరి 14న ప్రేమికులెవరైనా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే వారికి పెళ్లిళ్లు చేస్తామని హిందూ మహాసభ స్పష్టం చేసింది.యువత పాశ్చాత్య సంప్రదాయాలను వీడాలని సూచించింది.

దేశంలోని అన్ని నగరాలు, ప్రధాన పట్టణాల్లోని మాల్స్, పార్కులు, చారిత్రక కట్టడాల వద్ద తమ సంస్థ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.తమ బృందాలు అక్కడికొచ్చే ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇస్తారు.

ఇష్టమున్నవారికి అక్కడే పెళ్లి కూడా చేస్తారు అని హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌషిక్ మీడియాకు తెలిపారు.పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం గులాబీ పూలు, గ్రీటింగ్‌కార్డులు పట్టుకుని తిరిగేవారికి కౌన్సెలింగ్ ఇస్తామని, వారి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామన్నారు.

అంతేకాకుండా ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేక దినం ఏదీ అవసరం లేదని స్పష్టం చేశారు.‘మనదేశంలో ఏడాది పొడవునా, 365 రోజులు ఇష్టవారికి ప్రేమను వ్యక్తం చేయవచ్చు.

వీధుల వెంట, పార్కుల్లో కాదు’ అని ఆయన పేర్కొన్నారు.పాశ్చాత్య ధోరణులకు అలవాటుపడి యువత చెడిపోతుండటాన్ని తమ సంస్థ అంగీకరించదని.

వారి సక్రమ మార్గంలో నడిపించేందుకు తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు.ఇదే పద్దతిని ఇష్టం అయిన వారిని ఒక్కటి చేయడంలో చూపిస్తే మరింత మంచిదని ప్రేమికుల వాదన.

ఏది ఏమైనా ప్రేమికులారా జర జాగ్రత్త.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube