టీ పార్టీ, డిన్నర్‌ పార్టీ చూశాం ఈ ‘గో మూత్ర’ పార్టీ ఏంటీ బాసూ? వివరాలకు క్లిక్‌ చేయండి  

Hindu Maha Sabha To Hold Gaumutra Party At Delhi For Public Health - Telugu Delhi, Gaumutra Party,, Public Health

మనం ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు విన్నాం.బర్త్‌డే పార్టీ.

 Hindu Maha Sabha To Hold Gaumutra Party At Delhi For Public Health

టీ పార్టీ.డిన్నర్‌ పార్టీ చివరకు బజ్జీల పార్టీ అంటూ కూడా కొందరు సరదాగా పార్టీలు ఇచ్చుకుంటారు.

కాని చక్రపాణి మహారాజ్‌ మాత్రం గో మూత్ర పార్టీ ఇస్తాను రమ్మంటున్నాడు.పై పార్టీలకు ఎవరైనా పిలిస్తే ఎగురుకుంటూ వెళ్తారు.

టీ పార్టీ, డిన్నర్‌ పార్టీ చూశాం ఈ ‘గో మూత్ర’ పార్టీ ఏంటీ బాసూ వివరాలకు క్లిక్‌ చేయండి-General-Telugu-Telugu Tollywood Photo Image

కాని గో మూత్ర పార్టీకి ఎవరు వెళ్తారు చెప్పండి అని మీరు అనుకుంటున్నారా.కాని ఈయన ఆహ్వానం మేరకు చాలా మంది నేడు అంటే మార్చి 14న గోమూత్ర పార్టీకి హాజరు కాబోతున్నారట.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు.దాదాపుగా అయిదు వందల మందికి గాను ఈ పార్టీని ఏర్పాటు చేశారట.

గోమూత్ర పార్టీకి హాజరు అయ్యే వారు ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదట.గోమూత్రం ప్రయోజనం తెలిసిన వారు ఈ పార్టీకి హాజరు అవ్వొచ్చు అంటున్నారు.ఈ పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.గోడ పత్రికలు వేయడంతో పాటు ఏకంగా సోషల్‌ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు.

ఈ ప్రచారం అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని విధాలుగా చేస్తున్నారు.ప్రస్తుతం గోమూత్ర పార్టీకి సంబంధించిన పోస్టర్‌లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

దిల్లీలో ఈ పార్టీని నిర్వహించబోతున్నట్లుగా హిందూ మహాసభ అధ్యక్షుడు అయిన చక్రపాణి మహారాజ్‌ ప్రకటించాడు.ఇతరులు ఎలాగూ టీ పార్టీ ఏర్పాటు చేస్తారు.ఎప్పుడు టీ పార్టీలు ఇతర పార్టీలకు ఏం వెళ్తారు.ఆరోగ్య ప్రధాయిని అయిన గో మూత్ర పార్టీకి ఈసారి రమ్మంటూ ఆయన పిలుపునిస్తున్నాడు.

ప్రతి ఒక్కరికి కూడా అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ గోమూత్ర పార్టీని ప్రతి ఒక్కరు ఎంజాయ్‌ చేస్తారని అన్నారు.

పార్టీకి వచ్చిన వారికి పలు ఆరోగ్య సూత్రలను చెప్పబోతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.గోమూత్రంతో పాటు గోవు పాలు మరియు పేడ విశేషాలు కూడా వివరించబోతున్నారట.దిల్లీలో జరిగే ఆ గోమూత్ర పార్టీ సక్సెస్‌ అయితే దేశంలో ఇతర ప్రధాన పట్టణాల్లో కూడా ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో హిందూ మహాసభ సంఘం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మన వద్ద ఎప్పుడు అవుతుందో వెళ్దాం అనుకుంటున్నారా…!

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు