పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి.. ఎయిర్ ఫోర్స్ లో హిందూ యువకుడు

మతప్రాతిపాధికన ఏర్పడిన దేశాలలో పాకిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది.ముస్లిం దేశం అయిన పాకిస్తాన్ లో హిందువులు మైనార్టీలుగా ఇప్పటికి బ్రతుకుతున్నారు.

 Hindu Guy Appointed As A Air Pilot In Pakistan, Lock Down, Hinduism, Corona Effe-TeluguStop.com

వారి మీద ఎన్ని విధాలుగా దాడులు చేసిన బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది.ఇప్పటికి పాకిస్తాన్ లో హిందువులకి ప్రతిరోజు భయానక వాతావరణం కనిపిస్తుంది.

అలాంటి పాకిస్తాన్ లో హిందువులు ఉన్నత స్థానాలలోకి రావడం చాలా అరుదుగా జరుగుతుంది.గతంలో పాకిస్తాన్ క్రికెట్ టీంలో డానిష్ కనేరియా బౌలర్ గా స్థానం సంపాదించాడు.

అయితే అతను హిందువుగా ఉన్నందుకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు అనే విషయంలో షోయబ్ అక్తర్ నేరుగా చెప్పడం విశేషం.

ఇదిలా ఉంటే ఇప్పుడు పాకిస్థాన్ చరిత్రలో తొలిసారి ఓ హిందూ యువకుడు ఆర్మీలో నియమితుడయ్యాడు.

జనరల్ డ్యూటీ పైలట్ అధికారిగా రాహుల్ దేవ్ ను నియమించినట్టు పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ప్రకటన చేసింది.కరోనా సంక్లిష్ట సమయంలో ఈ గుడ్ న్యూస్ చెబుతున్నామని తెలిపింది.

సింధ్ ప్రావిన్స్ లోని థర్పర్కర్ అనే మారుమూల గ్రామం నుంచి జనరల్ డ్యూటీ పైలట్ గా రాహుల్ ఎంపికయ్యారని వెల్లడించింది.పాకిస్థాన్ అధికారిక రేడియో కూడా ఈరోజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

పాక్ చరిత్రలోనే తొలిసారిగా పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ లో ఓ హిందూ యువకుడు నియమితులయ్యారని పాక్ రేడియో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube