ఉస్మానియా మళ్ళీ రగులుతుందా ?

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ గొడవలు జరుగుతాయా? మళ్ళీ హింసాత్మక ఘటనలు సంభవిస్తాయా? ఇలాంటి అనుమానాలు రావడానికి కారణం వచ్చేనెల అక్కడ కొన్ని విద్యార్థీ సంఘాల వారు గొడ్డు కూర పండుగ అంటే బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించడమే.దేశంలో ప్రస్తుతం మాట అసహనం మీద, గోవుల వధ, ఆవు మాంసం భక్షణ మీద పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే.వాతావరణం బాగా వేడిగా ఉన్న పరిస్థితిలో ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించడం తప్పనిసరిగా వివాదాస్పదమవుతుంది.2012లో ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినప్పుడు హింసాత్మక ఘటనలు జరిగాయి.ఈసారి కూడా అలాంటి ఘటనలు జరగవచ్చని కొందరు అనుమానిస్తున్నారు.బీఫ్ ఫెస్టివల్ జరగనివ్వకుండా అడ్డుకోవాలని హిందూ అధికారులకు విజ్ఞప్తి చేశాయి.హిందూ జన జాగృతి సమితి నాయకులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్మలను కలిసి బీఫ్ ఫెస్టివల్ జరగనివ్వకుండా చూడాలని కోరారు.కమ్యునిస్టు పార్టీలకు, రాడికల్ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్ధి సంఘాలు, దళిత సంఘాలు బీఫీ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించాయి .ఆహారం మీద ఆంక్షలు విధించడం ఏమిటనేది వీరి వాదన.అందుకు నిరసనగా గొడ్డు కూర పండుగ నిర్వహిస్తున్నారు.

 Hindu Groups Seek Ban On Beef Festival-TeluguStop.com

వాస్తవానికి ఇలాంటి నిరసన కార్యక్రమాలకు విశ్వవిద్యాలయాలను వేదికలుగా చేయకూడదు.మరి దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube