దుర్గాదేవిగా కమలా హారిస్: మేనకోడలి చిలిపి పనితో కమలమ్మకు చిక్కులు

భారతదేశంలో నేతల్ని పార్టీ శ్రేణులు, అభిమానులను ఆరాధ్య దేవతలతో పోల్చడం, ఆ రూపంలో వారికి కటౌట్లు ఏర్పాటు చేయడం వంటివి ఎన్నో చూశాం.ఆ పిచ్చి పిక్స్‌కి వెళ్లి నాయకులకు గుళ్లు కట్టిన సందర్భాలు కూడా దేశంలో చాలానే ఉన్నాయి.

 Hindu Groups Express Anger Over Tweet By Kamala Harris’ Niece Showing Her As G-TeluguStop.com

అయితే ఇది ఇప్పుడు భారత్‌ను దాటి ప్రపంచమొత్తం పాకిపోయింది.తాజాగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరపున అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సర్వేలన్నీ డెమొక్రాటిక్ పార్టీకి అనుకూలంగా వున్న వేళ. కమల మేనకోడలు మీనా హారిస్ చేసిన ఓ చిలిపి పని హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది.

మీనా హారిస్ పోస్ట్‌ చేసిన ఫోటోలో.దుర్గాదేవి ముఖం స్థానంలో కమలా హారిస్ ఫోటోను మార్ఫింగ్ చేయ‌గా.అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మహిషాసురగా చిత్రీకరించారు.ఇక డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్య‌ర్థి జో బిడెన్‌ను అమ్మవారి వాహనం సింహంతో పోల్చారు.

రాక్షసుడైన మహిషాసురుడి రూపంలో వున్న ట్రంప్‌ను శూలంతో పొడిచి చంపుతున్నట్లు కనిపిస్తోంది.అయితే ఈ ఫోటోపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా స్పందించింది.

హిందువుల ఆరాధ్య దైవం ఫోటోను ఇతరుల ముఖ చిత్రాలతో క్యారికేచర్‌లా మలచడంపై ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది.అందువల్ల మీనా హారిస్.

హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
ఈ వివాదం అంతకంతకూ ముదురుతుండటంతో మీనా ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించక తప్పలేదు.

అయితే, హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రతినిథి రుషి భుటాడ మాట్లాడుతూ.ఈ ఫొటోను మీనా హారిస్ రూపొందించలేదని చెప్పారు.ఈ బొమ్మ వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతోందని, దానిని తాము సృష్టించలేదని బిడెన్ కాంపెయిన్ తనకు చెప్పిందని తెలిపారు.మరోవైపు హిందూ అమెరికన్ కమ్యూనిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హెచ్ఏఎఫ్ హిందూ దేవీ దేవతల బొమ్మలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై మార్గదర్శకాలను విడుదల చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube