జీవశాస్త్రంలో ఇప్పుడున్న పలు సాంకేతిక విధానాలకు హిందూ దేవుళ్లే ప్రేరణ తెలుసా..?

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో నేటి తరుణంలో రోజుకో కొత్త ఆవిష్కరణ జనాలకు అందుబాటులోకి వస్తోంది.ఆయా రంగాల్లో ప్రజల జీవితాలను మెరుగు పరిచే, వారికి మరింత సౌలభ్యాన్ని అందజేసే అనేక సదుపాయాలు ప్రజలకు అందుబాటులో వస్తున్నాయి.

 Hindu Gods Inspire Many Techniques In Biology-TeluguStop.com

అయితే నేడు అందుబాటులో ఉన్న చాలా వరకు పరిజ్ఞానాలు ఒకప్పుడు నిజానికి భారతదేశంలో ఉన్నవే.ముఖ్యంగా హిందూ పురాణాల ప్రకారం.

ప్రస్తుతం జీవశాస్త్రంలో అందుబాటులో ఉన్న పలు సాంకేతిక పద్ధతులు, విజ్ఞానాలు ఎప్పుడో మన దగ్గర ఉండేవి.అలాంటి విజ్ఞానాల గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1 సరోగసీ


సంతానం కావాలనుకునే దంపతులు తమ అండాలు, శుక్రకణాలను దానం చేస్తే వాటిని ఫలదీకరణం చెందించి, పిండంగా మార్చి వేరే మహిళ గర్భాశయంలో ప్రవేశపెడతారు.దీంతో ఆ మహిళే బిడ్డకు జన్మనిస్తుంది.

ఈ ప్రక్రియలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు ఎలాంటి అధికారాలు ఉండవు.ఆమెతో ముందే అగ్రిమెంట్ కుదుర్చుకుని ఆ మేరకు దంపతులు ఆమె ద్వారా బిడ్డను కంటారు.

దీన్నే సరోగసీ అంటారు.నేడు చాలా దేశాల్లో ఈ పద్ధతి అందుబాటులో ఉంది.

అయితే సరోగసీ అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో ద్వాపర యుగంలోనే మన దేశంలో ఉండేది.అప్పట్లో.

వాసుదేవుడు, దేవకి అనే దంపతులకు పుట్టిన పిల్లలను పుట్టినట్లు కంసుడు చంపుతుంటే.ఈ సారి పుట్టే బిడ్డను ఎలాగైనా కాపాడాలని చెప్పి.

వారు యోగమయ అనే దేవతను కోరగా.అందుకు ఆమె స్పందించి దేవకి కడుపులో ఉన్న పిండాన్ని వారికి దూరంగా ఎక్కడో ఉన్న రోహిణి అనే మహిళ గర్భాశయంలో ప్రవేశపెడుతుంది.

దీంతో ఆమె కడుపున బలరాముడు జన్మిస్తాడు.ఇలా సరోగసీ విధానం అప్పట్లోనే మన దగ్గర ఉందన్నమాట.

2.క్లోనింగ్


మనిషిని పోలిన మనుషులను, జంతువులు, ఇతర జీవాలను పోలిన జీవాలను సృష్టించే ప్రక్రియ పేరే క్లోనింగ్.అయితే ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు కేవలం జంతువులను మాత్రమే క్లోనింగ్ చేశారు.మనుషుల క్లోనింగ్ ఇంకా సాధ్యపడలేదు.కానీ అందుకు సంబంధించి సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు.ఇక ద్వాపర యుగంలోనే క్లోనింగ్‌కు సంబంధించి మనకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.

వాటిలో ఒకటి గాంధారి 100 మంది కౌరవులకు జన్మనివ్వడం.అప్పట్లో గాంధారి ఏకంగా రెండు సంవత్సరాల పాటు గర్భం ధరించినా ఆమెకు పిల్లలు కలగరు.

ఆమెకు డెలివరీలో పెద్ద మాంసం ముద్ద బయటకు వస్తుంది.అయితే వ్యాసులు ఆ ముద్దను 100 భాగాలుగా కత్తిరించి వాటిని 100 కుండల్లో పెట్టి వాటిల్లో మూలికలు, నెయ్యి వేసి ఆ కుండలను రెండు సంవత్సరాల పాటు అలాగే పెడతాడు.

ఆ కుండల్లో నుంచి 100 మంది కౌరవులు జన్మిస్తారు.ఇది క్లోనింగ్‌కు మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.

అలా అప్పట్లోనే మనుషులను క్లోనింగ్ చేశారన్నమాట.

3.అవయవాల మార్పిడి


పార్వతిని కలిసేందుకు వచ్చిన శివున్ని అడ్డుకున్నందుకు వినాయకుడి తలను శివుడు నరుకుతాడు కదా.అనంతరం పలు పరిస్థితుల నడుమ వినాయకుడికి ఏనుగు తల అమరుస్తారు.ఇలా అవయవాల మార్పిడి చేస్తారు.ఇప్పుడు కూడా చాలా చోట్ల అవయవ దానం చేసే వారి శరీరంలోని అవయవాలను గ్రహీతలకు అమరుస్తున్నారు.అలాగే త్వరలో ఇటాలియన్ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ సెర్గియో ఏకంగా తలను మార్పిడి చేయనున్నాడు.అందుకు గాను ఆయనకు ఒక వ్యక్తి వాలంటీర్‌గా కూడా లభించాడు.

అయితే ఆ తల మార్పిడి ఆపరేషన్‌కు ఆయనకు ప్రేరణనిచ్చింది మన గణేషుడి కథే అని చెప్పవచ్చు.

4.అవయవాలు మళ్లీ పెరగడం


పూర్వ కాలంలో దేవతలు, రాక్షసుల చేతులు, కాళ్లు, ఇతర అవయవాలను నరికినప్పుడు అవి మళ్లీ అప్పటికప్పుడే మొలిచేవి కదా.అలా కోల్పోయిన అవయవాలను తిరిగి మొలిపించే నూతన ప్రక్రియకు సైంటిస్టులు శ్రీకారం చుట్టారు.త్వరలోనే ఈ దిశగా కూడా వారు విజయం సాధిస్తారని తెలుస్తోంది.

5.జీన్స్


దంపతులు తమకు కావల్సిన జీన్స్, లక్షణాలతో ఉన్న బిడ్డలు తమకు జన్మించేలా బేబీలను డిజైన్ చేసుకునే నూతన విధానాన్ని సైంటిస్టులు ప్రస్తుతం పరీక్షిస్తున్నారు.ఈ దిశగా వారు ఇంకా సత్ఫలితాలను సాధించలేదు కానీ.

దీనికి ప్రేరణ మాత్రం.వీరభద్రుని కథే.దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో శివుడు అవమానాల పాలవ్వగా, పార్వతి అది తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకుంటుంది.దీంతో శివుడు తన జటాజూటం నుంచి వెంట్రుకలను పీకి నేలకు కొడతాడు.

దీంతో వీరభద్రుడు జన్మిస్తాడు.వీరభద్రుడిది శివుడి అంశే.

కానీ భిన్నమైన వేషధారణ, ఆయుధాలను కలిగి ఉంటాడు.అంటే శివుడి జన్యువులే అతనికి వచ్చాయి కానీ, ఇతర లక్షణాలు వేరే ఉంటాయన్నమాట.

అలా నేటి తరుణంలో తల్లిదండ్రులు కూడా తమ జీన్స్‌తో ఇతర లక్షణాలతో పిల్లల్ని పొందేలా సైంటిస్టులు జెనిటిక్ ఇంజినీరింగ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.అలా ఒకప్పటి వీరభద్రుని కథే ఇప్పటి జెనెటిక్ ఇంజినీరింగ్‌కు ప్రేరణ అని చెప్పవచ్చు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube