హిందు ధర్మ శాస్త్ర ప్రకారం ఎట్టి పరిస్థితిలో కింద పెట్టకూడని వస్తువులు  

Hindu Dharnmam Prakaaram Kinda Pettakudani Things -

హిందు ధర్మ శాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులను చాలా పవిత్రంగా చూసుకుంటాం.ఆ వస్తువులను అశుభ్రమైన ప్రదేశంలో గాని, కింద గాని పెట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం.

పూజకు ఉపయోగించే పూలు, కొబ్బ‌రికాయ‌, అగ‌ర్‌బ‌త్తీలు, క‌ర్పూరం వంటి కింద పెట్టం.ఒకవేళ పొరపాటున కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించము.

Hindu Dharnmam Prakaaram Kinda Pettakudani Things-Devotional-Telugu Tollywood Photo Image

ఇవే కాకుండా హిందూ ద‌ర్శ‌శాస్త్రం ప్ర‌కారం కింద పెట్టకూడని మరి కొన్ని వస్తువులు ఉన్నాయి.వీటిని పెడితే అశుభం జరుగుతుందని నమ్ముతారు.

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం

జంధ్యం
హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధ‌రించే ఆచారం మరియు సంప్రదాయం ఉంటుంది.జంధ్యాన్ని త‌ల్లిదండ్రులు, గురువుల‌కు ప్ర‌తి రూపంగా భావిస్తార‌ట‌.

అందువలన జంధ్యంను కింద పెడితే వారిని అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ట‌.అందువల్ల దాన్ని ఎప్పుడూ నేల‌పై పెట్ట‌కూడ‌దు


సాలిగ్రామం
సాలిగ్రామం విష్ణువుకు ప్రతిరూపం.అందువల్ల సాలిగ్రామాన్ని కింద పెడితే సమస్యలు ఎదురు అవుతాయని నమ్ముతారు

దీపం
దేవుడి ముందు పెట్టే దీపాల‌ను నేల‌పై పెట్ట‌రాదు.వాటిని వెలిగించినప్పుడు దీపం కింద పళ్లెం లేదా తమలపాకు పెట్టాలి.

ఒకవేళ నేలపైనా పెడితే దేవత‌ల‌ను అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ట‌

బంగారం
బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ రూపంగా చూస్తారు.అటువంటి బంగారాన్ని నేలపై పెడితే, లక్ష్మిదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు

శంఖువు… శంఖువులో సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి కొలువై ఉంటుంద‌ట‌.

అందువల్ల దాన్ని కూడా నేల‌పై పెట్ట‌రాదు.ఒకవేళ పెడితే ఆర్థిక స‌మ‌స్య‌లు క‌లుగుతాయ‌ట‌.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Hindu Dharnmam Prakaaram Kinda Pettakudani Things Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL