వేలంటైన్ కి వ్యతిరేకంగా ఆందోళన! దేశ వ్యాప్తంగా నిరసనలు!

వాలెంటైన్ డే రానే వచ్చింది.ప్రేమికుల రోజు లేదా వేలంటైన్స్ టైమింగ్ ఎదిరించి వాళ్లు ఇండియాలో చాలామంది ఉన్నారు.

 Hindu Activists Serious Protest Against Valentine Day-TeluguStop.com

పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే ఇలాంటి విశృంఖల వేడుకలకు దూరంగా ఉండాలని భారతీయ సాంప్రదాయాలకు విలువ ప్రతి ఒక్కరు కోరుతూ ఉంటారు.అయితే కొంతమంది హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విశ్వసించే హిందుత్వ వాదులు ఈ ప్రేమికుల రోజు వేడుకలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు.

ప్రతి ఏడాది ప్రేమికుల రోజు వచ్చిందంటే తమ ఆందోళనను తీవ్రతరం చేసి దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేస్తుంటారు.

అలా ప్రేమికులరోజు సందర్భంగా ఈరోజు మరోసారి దేశవ్యాప్తంగా హిందుత్వ సంఘాల కార్యకర్తలు ఆందోళన విస్తృతం చేశారు.

నిరసన ర్యాలీలు తీస్తూ వాలెంటైన్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వాలెంటైన్ డేని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.ఈరోజు ఉదయాన్నే రోడ్డెక్కిన సంఘ పరివార్, ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీ, జన జాగరణ సమితి వంటి హిందుత్వ సంస్థలు కార్యకర్తలు ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేస్తున్నారు.

ప్రేమికులమంటూ చెప్పుకునే పార్కుల వెంట తిరిగితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.వీరి ఆందోళన నేపథ్యంలో ఈసారి ప్రేమికులు తమ సెలబ్రేషన్స్ బహిరంగ ప్రదేశాల్లో చేసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు.

అయితే హిందుత్వ సంస్థలు వ్యతిరేకతను కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు, లౌకిక వాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు వేడుకలు దేశంలో ఎలా జరుగుతాయి అనేది ఆసక్తికరంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube