బాలీవుడ్ ను షేక్ చేస్తున్న రౌడీ హీరో.. వారిద్దరి తర్వాత మూడో వ్యక్తిగా రికార్డు!

హాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మనందరికీ సుపరిచితమే.తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్కుకున్నాడు.

 Vijay Devarakonda Dear Comrade Hindi Version 300 Million Views Details, Bollywood, Vijay Devarakonda, Rashmika Mandanna, Dear Comrade , Hindi Version 300 Million Youtube Views, Allu Arjun, Sarrainodu, Bellm Konda Srinivas, Jaya Janaki Nayaka-TeluguStop.com

ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ.అర్జున్ రెడ్డి ఒక్క సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకునే యూత్ ఐకాన్ గా మారాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా భారీగా నిరాశపరిచింది.

 Vijay Devarakonda Dear Comrade Hindi Version 300 Million Views Details, Bollywood, Vijay Devarakonda, Rashmika Mandanna, Dear Comrade , Hindi Version 300 Million Youtube Views, Allu Arjun, Sarrainodu, Bellm Konda Srinivas, Jaya Janaki Nayaka-బాలీవుడ్ ను షేక్ చేస్తున్న రౌడీ హీరో.. వారిద్దరి తర్వాత మూడో వ్యక్తిగా రికార్డు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.2019 జూలై 26న విడుదల అయింది.ఇక ఇందులో రష్మిక మందన, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినప్పటికీ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.ఇది ఇలా ఉంటే డియర్ కామ్రేడ్ సినిమాను హిందీ వెర్షన్ సినిమాను 2020 జనవరి 19న యూట్యూబ్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డును సృష్టించింది.అంతేకాకుండా తెలుగులో ప్లాప్ అయిన ఈ సినిమా ఇందులో మాత్రం సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.

Telugu Allu Arjun, Bellmkonda, Bollywood, Dear Comrade, Hindiyoutube, Sarrainodu-Movie

డియర్ కామ్రేడ్ సినిమా యూట్యూబ్ లో రెండేళ్ల క్రితం విడుదల చేశారు.ఇప్పటి వరకు ఈ సినిమా 300 మిలియన్ల వ్యూస్ ని రాబట్టి యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.ఇక ఇప్పటి వరకు రెండు తెలుగు చిత్రాలు హిందీలో డబ్బింగ్ అయ్యి 300 మిలియన్ ల వ్యూస్ ని సాధించాయి.అందులో ఒకటి బోయపాటి అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా కాగా, మరొకటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన జయ జానకి నాయక సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యి ఈ ఘనతను సాధించాయి.

తాజాగా ఆ జాబితాలోకి డియర్ కామ్రేడ్ సినిమా కూడా చేరింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube