టార్గెట్ టాలీవుడ్.. బాలీవుడ్ హీరోల దండయాత్ర

Hindi Movies Dubbing In Tollywood, Bollywood, Tollywood ,Tiger 3, War 2, Ntr ,Hrithik Roshan ,Sandeep Reddy, Animal, Social Media, Chiran Jeevi

ఎప్పుడు మీరు మాత్రమే మా బాక్స్ ఆఫీస్ పై దాడి చేస్తారా ఇక మేము కూడా మీ ఇండస్ట్రీ ని తెగ వాడేస్తాం అంటూ టాలీవుడ్( Tollywood ) పైకి దూసుకస్తున్నారు.ఆలా ఒకరో ఇద్దరో వస్తే పర్వాలేదు కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలు తమ తమ సినిమాలను తెలుగు లో కూడా రిలీజ్ చేస్తుండటమే ఈ మధ్య బాగా పెరిగింది.

 Hindi Movies Dubbing In Tollywood, Bollywood, Tollywood ,tiger 3, War 2, Ntr ,-TeluguStop.com

ఇటీవల కాలంలో అయితే మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో కూడా విడుదల అవుతున్నాయి కాబట్టి తెలుగు సినిమాల కథలను రీమేక్ చేయకుండా తమిళ మరియు మలయాళ సినిమాల పై బాలీవుడ్ ఫోకస్ పెరిగింది.కానీ తీసిన సినిమాలను మాత్రం తెలుగు ప్రేక్షకులకు చూపించి విడుదల చేసుకోవడం మాత్రం బాగానే చేస్తున్నారు.

Telugu Anima, Animal, Bollywood, Chiran Jeevi, Hrithik Roshan, Sandeep Reddy, Ti

కొన్నేళ్ళకు ముందు కేవలం సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి హీరోల సినిమాలు మాత్రమే వచ్చేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.తెలుగు అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికి తెగ కష్టపడి పోతు హైదరాబాద్ కి వచ్చి మరి ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ ఇండియా కు సినిమా క్యాపిటల్ గా మారిపోతుంది.

ఎవరు సినిమా విడుదల చేయాలన్న హైదరాబాద్ కి చేరిపోతున్నారు.ఇక ఈ మధ్య టైగర్ ష్రాఫ్ సైతం తన గణపత్ సినిమా ను తెలుగు లో కూడా విడుదల చేస్తున్నాడు.

ఈ చిత్ర టీజర్ చిరంజీవి చేత విడుదల చేయించారు.ఇక సల్మాన్ ఖాన్ ఈ దివాళీ కి టైగర్ 3( Tiger 3 ) తో వస్తున్నాడు.

Telugu Anima, Animal, Bollywood, Chiran Jeevi, Hrithik Roshan, Sandeep Reddy, Ti

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 కూడా తెలుగు లో డబ్బింగ్ చేసి వదలడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరో వైపు తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీసిన హిందీ మూవీ ఆనిమల్( Animal ) కూడా తెలుగు లో విడుదల అవుతుంది.మొత్తానికి ఇలా సౌత్ పై నార్త్ వారి ఫోకస్ పెరిగిపోయింది.పైగా ఫ్యాన్ ఇండియా మూవీ అంటే ఒక్కో బాషా నుంచి ఒక్కో స్టార్ ని పెట్టి తీయడం ఈ మధ్య బాగా పెరిగింది కాబట్టి ఆనిమల్ లో హిట్ అవ్వాలంటే రష్మిక మందన్న, వార్ 2 హిట్ అవ్వాలంటే తారక్ ఉండనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube