హిందీకి అమెరికాలో భారీ డిమాండ్..ఎందుకంటే..??

భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలు, భారత్ వెళ్లి రావాలన్నా, అక్కడి చలన చిత్రాలు చూడాలన్నా ముఖ్యంగా కావాల్సింది ఆయా బాషలపై పట్టు.అయితే ఇప్పుడు అమెరికా పౌరులని , ఇండో అమెరికన్స్ ని హిందీ బాష ఎంతగానో ఆకర్షించడంతో హిందీ నేర్చుకునే వారి సంఖ్య ఎక్కువగా అయ్యిందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

 Hindi Language Attracts American People-TeluguStop.com

వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబార కార్యాలయం నిర్వహించే హిందీ తరగతుల్లో చేరేందుకు అధిక సంఖ్యలో పేర్లు నమోదు చేసుకుంటున్నారట.ఈ పేరు నమోదు సమాఖ్య 110గా ఉన్నట్లు తెలిపారు.ఈ పేర్లని నమోదు చేసుకున్న వారిలో భారత సంతతి అమెరికన్లతో పాటు బ్రిటన్‌.జర్మనీ…ఒమన్‌…ఉక్రెయిన్‌.బెలారస్‌.బంగ్లాదేశ్‌ మొదలగు దేశాలవారు ఉండటం విశేషం.

వివిధ దేశాల వారు సైతం హిందీ నేర్చుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.భారతీయ చిత్రాలు అమెరికాలో ప్రదర్శితం అవ్వడం ఒకటైతే పర్యతకులుగా భారత్ వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అంటున్నారట.అయితే అక్కడ హిందీ బాషని భోదించే మోక్ష రాజ్ మాట్లాడుతూ వారంలో రెండేసి రోజులు చప్పున హిందీ భోధన తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube