బిగ్ బాస్ విన్నర్ కి బ్రెయిన్ స్ట్రోక్.. దాంతో ప్రస్తుతం ఆసుపత్రిలో...  

హిందీలో ఆషీకీ, గూమ్రా, దిల్ వాలే నా ప్యార్, తదితర చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రాహుల్ రాయ్ హిందీ లో బాగా పాపులర్ అయిన ప్రముఖ రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్” మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని విజేతగా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

TeluguStop.com - Hindi Bigg Boss Season One Winner Rahul Roy Brain Stroke News

 అంతేగాక పలు చిత్రాల్లో నటించే అవకాశాలను కూడా తెచ్చుకుని బాగానే రాణిస్తున్నాడు.అయితే గత కొద్దికాలంగా రాహుల్ రాయ్ ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

కాగా ఇటీవలే రాహుల్ రాయ్ కి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అతడి కుటుంబ సభ్యులు ముంబై లో ఉన్నటువంటి ప్రముఖ ఆసుపత్రిలో  చేర్పించినట్లు తెలిపారు.దాంతో ప్రస్తుతం రాహుల్ రాయ్ ని వైద్యులు ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు.

TeluguStop.com - బిగ్ బాస్ విన్నర్ కి బ్రెయిన్ స్ట్రోక్.. దాంతో ప్రస్తుతం ఆసుపత్రిలో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో తాజాగా రాహుల్ సోదరుడు ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేశాడు. ప్రస్తుతం ఎలాంటి రాహుల్ రాయ్ కి ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని కేవలం బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని కూడా తెలిపాడు.

దాంతో రాహుల్ రాయ్ అభిమానులు కొంతమేర ఆందోళన చెందుతున్నారు.

కాగా పలువురు సినీ సెలబ్రిటీలు రాహుల్ రాయ్ తొందరగా కోలుకోవాలని తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దేవుడిని ప్రార్థిస్తున్నారు.కాగా ప్రస్తుతం రాహుల్ రాయ్ హిందీలో ప్రముఖ దర్శకుడు కను మెహల్ దర్శకత్వం వహిస్తున్న “ఆగ్రా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో కొంతకాలంగా తాత్కాలికంగా నిలిపి వేశారు.

ప్రస్తుతం రాహుల్ రాయ్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో ఉండటంతో అతడి స్థానంలో మరో ప్రముఖ నటుడిని తీసుకునేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

#Rahul Roy #HindiBig #HindiBig #RahulRoy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు