బాలయ్యా ఎక్కడయ్యా ? ప్రశ్నిస్తున్న హిందూపురం

హిందూపురం నియోజకవర్గం పేరు చెబితే టీడీపీ కంచుకోట అనే మాట అందరికి గుర్తొస్తుంది.పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడుతూ వస్తుంది.

 Hindhpur People Looking For Balakrishna-TeluguStop.com

ఏపీలో కాంగ్రెస్, వైసీపీ గాలి బలంగా వీచిన సమయంలోనూ ఇక్కడ టీడీపీ నే పాగా వేస్తూ వస్తోంది తప్ప మరో పార్టీకి ఇక్కడ అధికారం దక్కనీయడంలేదు.ఇక మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కూడా ఈ కంచుకోటాను బద్దలుకొడదామని తీవ్రంగా ప్రయత్నించాడు.

అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణను గెలిపించారు.అసలు హిందూపురం లో బాలయ్యకు ఉన్న వ్యక్తిరేకత కారణంగా అక్కడ ఆయన ఓటమి తప్పదని అంతా అనుకున్నారు.

కానీ ఆయన మళ్ళీ గెలిచి షాక్ ఇచ్చారు.అయితే ఇక్కడ బాలయ్య గెలిచినా దగ్గర నుంచి ప్రజలకు అస్సలు అందుబాటులోనే ఉండకపోవడంతో ఆయన పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Balakrishna, Balakrishnashow, Hindupurmla, Tdp Chandrababu, Tdpmla-

ఇక్కడి ప్రజలు బాలకృష్ణపై నమ్మకం పెట్టుకుని గెలిపించినా ఆయన మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు.ఎన్నికలు జరిగిన ఆరునెలల్లో ఎమ్మెల్యే నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం మానేశారు.ఈ నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే ఇక్కడికి వచ్చారు.దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇక్కడి ఎమ్యెల్యే గా వారి బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాల్సిన బాలకృష్ణ సినిమాల్లో బిజీగా గడుపుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.ఆయన అసెంబ్లీ, అధికార సమావేశాలకు హాజరుకాకపోవడంతో అధికారులతో పాటు ప్రజల్లో కూడా తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

పైగా ఆయన నియోజకవర్గం బాధ్యతలను పీఏలకు అప్పగించడం, గతంలో తీవ్ర వివాదానికి కారణమైంది.అయినా ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ మరిన్ని విమర్శలను తనమీద వేసుకుంటున్నాడు బాలకృష్ణ .

Telugu Balakrishna, Balakrishnashow, Hindupurmla, Tdp Chandrababu, Tdpmla-

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ బాలయ్య వ్యవహారం ఇదేవిధంగా ఉండేదట.అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్లేవారట.వచ్చినప్పుడల్లా మండలాల్లో ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, రోడ్డుషోలు చేస్తూ మామ అనిపించేవారు తప్ప ఇక్కడ ప్రధాన సమస్యగా ఉన్న మంచినీటి విషయంలోనూ అదే నిర్లక్ష్యం కనబరిచి విమర్శలపాలయ్యారు.ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో సతీసమే తంగా హిందూపురంలో ఇంటింటి ప్రచారాలు చేశారే తప్ప ఆ తర్వాత కనిపించలేదు.

ఇక ఇప్పుడు కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తూ సినిమాల మీద దృష్టిపెట్టి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానెయ్యడంపై విమర్శలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube