హిందీ ఛత్రపతిలో హీరోయిన్‌ ఉన్నా లేనట్లేనట.. అసలు కారణం ఏంటంటే!

ప్రభాస్ హీరోగా శ్రియ హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చత్రపతి సినిమా తెలుగులో సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యింది.హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా డబ్బ్‌ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Heroine Role Chatrapathi Hindi Remake, Chatrapathi, Heroine, Prabhas, Vv Vinayak-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ సినిమా ను హిందీలో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో ఈ రీమేక్‌ రూపొందబోతుంది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను విభిన్నంగా రూపొందించేలా వివి వినాయక్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు ఉండరట.హీరోయిన్‌ పాత్రకు తెలుగు చత్రపతిలో ప్రముఖ పాత్ర అయితే ఉంటుంది.

కాని హిందీ రీమేక్‌ విషయానికి వస్తే మరోలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bellamkondasai, Chatrapathi, Chatrapaty, Rolechatrapathi, Prabhas, Rajamo

తెలుగు కు హిందీకి చాలా మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు.ప్రభాస్‌ ను హీరోగా ఓ రేంజ్ లో నిలబెట్టిన చత్రపతి సినిమాను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే ఇప్పుడు ఎవరు కూడా పెద్దగా చూడరు.అందుకే రెండు మూడు ఐటెం సాంగ్‌ లతో అదిరి పోయే మాస్ ఎలిమెంట్స్ తో సినిమాను రూపొందించాలని వి వి వినాయక్‌ మరియు టీమ్‌ భావిస్తున్నారు.

అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వ్యవహారం మొత్తం కూడా పూర్తి అయ్యిందట. హీరోయిన్ పాత్ర ఉంటుంది కాని చాలా నిడివి తక్కువ మరియు ప్రాముక్యత తలేకుండా ఉంటుందని అంటున్నారు.

త్వరలోనే హీరోయిన్‌ ఎవరు మరియు ఐటెం సాంగ్‌ లను ఎవరు చేయబోతున్నారు అనే విషయాలపై క్లారిటీ ఇవ్వబోతున్నారు.అన్ని వర్గాల హిందీ ఆడియన్స్ కు చేరువ అయ్యేలా ఈ సినిమాను రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నారు.

బెల్లం కొడుకు మరియు వి వి వినాయక్‌ కు కూడా ఇది మొదటి హిందీ సినిమా అవ్వడం వల్ల వారి భవిష్యత్తు ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube