ఔట్‌ డోర్‌ లో బిగ్‌ బాస్‌ సాధ్యమా?

తెలుగు బిగ్‌బాస్‌ ఈనెల చివరి నుండి లేదా వచ్చే నెల ఆరంభం నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది.ఇప్పటికే నాగార్జున హోస్ట్‌గా ప్రోమోల చిత్రీకరణ పూర్తి అయ్యింది.

 Hindi Bigg Boss Shoots In Salman Khan Farm House, Salman Khan Farm House, Hindi-TeluguStop.com

వాటిని ప్రసారం చేసి ఎప్పుడు షో అనేది ప్రకటించబోతున్నారు.మరో వైపు హిందీ బిగ్‌బాస్‌ కూడా ప్రారంభంకు సిద్దం అవుతోంది.

హిందీ బిగ్‌బాస్‌ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.చాలా రోజులుగా ఈసారి బిగ్‌బాస్‌ సల్మాన్‌ ఖాన్‌ ఫామ్‌ హౌస్‌లో ఉంటుందని అనుకుంటున్నారు.

ఫామ్‌ హౌస్‌ నుండి బయటకు వచ్చేందుకు సల్మాన్‌ ఇష్టపడటం లేదు.అందుకే అక్కడే షోను నిర్వహిస్తే ఎలా ఉంటుందని నిర్వాహకులు భావించారట.

ఎప్పుడు కూడా ఇండోర్‌లో షో నిర్వహణ ఉండేది.కాని ఈసారి కాస్త విభిన్నంగా ఉండేందుకు గాను సల్మాన్‌ ఖాన్‌ ఫామ్‌ హౌస్‌లో అది కూడా ఓపెన్‌ ప్లేస్‌లో పెద్ద ఎత్తున ఉన్న వ్యవసాయ భూమిలో షో నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది.అందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తూ ఈసారి బిగ్‌బాస్‌ ఉంటుందని ఇటీవలే టీజర్‌లో సల్మాన్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

Telugu Bigg Boss, Hindi Bigg Boss, Hindibigg, Salman, Salman Khan-

అది ఔట్‌ డోర్‌ అయితేనే సాధ్యం అవుతుంది కనుక సల్మాన్‌ వ్యవసాయ క్షేత్రంలోనే ఈ సీజన్‌ ఉంటుందేమో అంటున్నారు.ఒక వేళ అలా సాధ్యం కాకున్నా సల్మాన్‌ మాత్రం ఖచ్చితంగా వ్యవసాయ క్షేత్రం నుండే హోస్టింగ్‌ చేయబోతున్నాడు.ఎలా చూసుకున్నా ఈసారి సీజన్‌ చాలా కొత్తగా విభిన్నంగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.తెలుగులో నాగార్జున హోస్టింగ్‌ చేయబోతున్న విషయం తెల్సిందే.

తెలుగులో కూడా ఈసారి కరోనా కారణంగా ఫార్మెట్‌ కొత్తగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.అది ఎలా ఏంటీ అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube