సస్పెన్స్ కు తెరదించిన బీజేపీ.. అస్సాం సీఎంగా ఆయనేనటా.. ?

అస్సాం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దాని పై కొనసాగుతున్న సస్పెన్స్‌ తాజాగా వీడింది.గత ఆరు రోజులుగా ఈ విషయంలో అస్సాంలో ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 Himanta Bishwa Sharma As Assam Cm Candidate-TeluguStop.com

కాగా ఈ రోజు బీజేపి అధిష్టానం అస్సాం సీఎంగా హిమంత బిశ్వా శర్మను ఖరారు చేసింది.

ఇకపోతే మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.

 Himanta Bishwa Sharma As Assam Cm Candidate-సస్పెన్స్ కు తెరదించిన బీజేపీ.. అస్సాం సీఎంగా ఆయనేనటా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ రాష్ట్ర సీఎం పదవి కోసం సోనోవాల్, హిమంత బిశ్వాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.ఈ దశలో ఎవరిని సీయం పీఠం వరిస్తుందో అనే సస్పెన్స్‌ ప్రజల్లో, నేతల్లో నెలకొంది.

కానీ చివరికి హిమంత బిశ్వా వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపడంతో సోమవారం హిమంత బిశ్వా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్దం అవుతుందట.

ఇక జలుక్బరి నియోజకవర్గం నుంచి 2001 నుంచి 2015 వరకు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు హిమంత.

ఆ తర్వాత హస్తాన్ని వదిలి కమళాన్ని చేతబట్టిన హిమంత బిశ్వా, సోనోవాల్ కేబినెట్లో కీలకమైన ఆర్థిక, వైద్య, విద్య శాఖలకు మంత్రిగా పని చేశారు.కాగా తాజాగ సీయంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు.

#Assam #Selected #HimantaBishwa #CM Candidate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు