విశ్వక్ సేన్ సినిమా కోసం హైదరాబాద్ లోనే హిమాలయాలు -Telugu Tollywood Movie Actor Hero Profile & Biography  

ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ లో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ తరువాత ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగా, దర్శకుడుగా తన మార్క్ ఏంటో పరిచయం చేశాడు.విజయ్ దేవరకొండ తర్వాత తెలంగాణ భాషతో క్లిక్ అయిన హీరోగా విశ్వక్ సేన్ ఉన్నాడు.నాని ప్రొడక్షన్ లో హిట్ సినిమాతో మరో హిట్ ని తనఖాతాలో వేసుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమా చేస్తున్నాడు.పూర్తిస్థాయి డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.లాక్ డౌన్ కి ముందుగానే ఈ సినిమాని విశ్వక్ స్టార్ట్ చేశాడు.

ప్రాజెక్ట్ గామి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా హిమాల‌యాల నేప‌థ్యంలో సాగే క‌థగా ఉంటుంది.ఓ యాత్రికుడు తన హిమాలయాల ప్రయాణంలో చేసే సాహ‌సాల చుట్టూ ఈ సినిమా కథనం నడుస్తుంది.కెరియర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలతో ట్రావెల్ చేస్తున్న విశ్వక్ ఎంచుకున్న మరో డిఫరెంట్ స్టోరీ ఇది.
క్రౌడ్ ఫండింగ్ ప‌ద్ధ‌తి ద్వారా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.లాక్ డౌన్ కి ముందే సినిమా స్టార్ట్ అయినా కరోనా ఎఫెక్ట్ తో ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.అయితే కథ రీత్యా హిమాలయాలకు వెళ్లి షూటింగ్ చేయాలి.

ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చిన కూడా ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు.ఇలాంటి సమయంలో హిమాలయాలకు వెళ్లి షూట్ చేయడం అయ్యే పని కాదు.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ద‌రాబాద్ శివార్లో ఈ సినిమా కోసం ఓ సెట్ వేశారు.అక్క‌డే మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేశారు.హిమాలయాలు ఎలివేషన్ ఉండే విధంగా ఈ సెట్ ని డిజైన్ చేశారు.స‌రికొత్త విజువ‌ల్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాయ‌ని తెలుస్తుంది‌.పరిస్థితుల బట్టి థియేటర్స్ లో పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే అక్కడ రిలీజ్ చేయడం లేదంటే ఓటీటీకి వెళ్లిపోవడం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టాక్.త్వరలో ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

#Himalayas #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Himalayas Set In Hyderabad For Vishwak Sen Movie Related Telugu News,Photos/Pics,Images..