హిమాలయ ఉప్పు గురించి మీకు తెలుసా  

మనం ప్రతి రోజు కూరల్లో,వంటల్లో ఎక్కువగా అయొడిన్ ఉప్పును వాడుతూ ఉంటాం. కొంతమంది అయితే సముద్రపు ఉప్పును వాడుతూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్ లో హిమాలయ ఉప్పు ఎక్కువగా లభ్యం అవుతుంది. అయితే హిమాలయ ఉప్పు అంటే హిమాలయా కంపెనీ తయారుచేసిన ఉప్పు కాదు. ఈ ఉప్పు హిమాలయాల్లో సేకరించిన ఉప్పు. ఈ ఉప్పు వాడటం వలన మన శరీరానికి 84 సూక్ష్మ పోష‌కాలు లభిస్తాయి. ఇప్పుడు ఈ ఉప్పు వాడకం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుందాం.

హిమాలయా ఉప్పులో సహజసిద్ధమైన అయోడిన్ ఉంటుంది. ఈ అయోడిన్ థైరాయిడ్‌, గొంతు సంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలో సహాయపడుతుంది. మాములుగా మనం మార్కెట్ లో కొనే అయోడిన్ ఉప్పులో కృత్రిమ అయోడిన్ ని కలుపుతారు.

Himalayan Salt Health Benefits-

Himalayan Salt Health Benefits

ఈ ఉప్పులో మన శరీరానికి అవసరమైన 84 సూక్ష్మ పోష‌కాలు ఉండుట వలన అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

ప్రతి రోజు హిమాలయ ఉప్పును తీసుకోవటం వలన శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్ బ్యాలెన్స్ పెరిగి ద్రవాలు నియంత్రణలో ఉంటాయి. శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

ఎముక‌ల‌కు కాల్షియం అందుతుంది. త‌ద్వారా అవి ప‌టిష్టంగా మారుతాయి. విరిగిన ఎముక‌లు ఉన్న‌వారు ఈ ఉప్పును వాడితే త్వ‌ర‌గా ఎముక‌లు అతుక్కునేందుకు అవ‌కాశం ఉంటుంది.