టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి, బుల్లితెర ఆర్టిస్ట్ హిమజ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లితెరలో పలు సీరియల్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా తన నటనకు ఒక పేరు సంపాదించుకుంది.తొలిసారిగా హిమజ తెలుగు బుల్లితెరలో భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ తో పరిచయమైంది.
ఇక సీరియల్స్ లలో తన నటనతో బాగా ఆకట్టుకుంది.ఇక పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేసింది.
అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొంది.షోలో ఉన్నంతవరకు తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.
తన ఆట తీరుతో అందరినీ బాగా ఆకట్టుకుంది.
ఇక బిగ్ బాస్ తర్వాత హిమజ అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.
ఎక్కడో కొన్ని కొన్ని ప్రాజెక్టులలో మాత్రమే అవకాశం అందుకుంది.ఇక పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో కూడా హిమజను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు.
ఇక హిమజ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియా ద్వారా పలు అడ్వర్టైస్ లు కూడా చేసింది.
ఇప్పటికీ కూడా అవకాశాలు లేకపోవడంతో చిన్న చిన్న ప్రాడక్టులకు ప్రమోషన్స్ చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో.నిత్యం తెగ పోస్టులతో బిజీగా ఉంటుంది.ఫోటో షూట్ లంటూ తెగ ఫోటోలు దిగుతూ బాగా బిజీగా ఉంటుంది.
కానీ గ్లామర్ షో అంతగా నట్లు కనిపించదు.తన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకున్న కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
ఇక యూ ట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకుంటుంది.కొన్నిసార్లు ఫన్నీ వీడియోలు కూడా బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకుంది.అయితే అందులో టైంపాస్ కావటానికి ఏం చేస్తావు అని తనకు ప్రశ్న ఎదురవటంతో.
గుడికి వెళ్తాను అని చెప్పింది.అంటే ధ్యానం చేస్తారా అని అడగటంతో.
లేదు లేదు గుడికి వచ్చే వాళ్ళు బయట చెప్పులు, షూలు వదిలేస్తూ ఉంటారు కదా అవి అక్కడ ఇక్కడ మారుస్తూ ఉంటాను అని తెలిపింది.
ఆ తర్వాత వాళ్లు వాటికోసం వచ్చి వెతికినప్పుడు అక్కడ ఉన్నాయి ఇప్పుడే.అక్కడ చూశాను అని చెబుతాను అని తెలిపింది.దీంతో ఆ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్ పెడుతున్నారు.
ఇక ఓ నెటిజన్.అబ్బా ఇన్ని రోజులకి నిజం చెప్పావు నీ గురించి.
అడ్రస్ చెప్పు అటు సైడ్ ఉన్న టెంపుల్స్ కి చెప్పులు వేసుకుని రాము అంటూ సరదాగా కామెంట్ చేశారు.